Handshake Row : ఐసీసీ యూటర్న్..! పాక్‌కు స్వల్ప విజయం.. ఆండీ పైక్రాఫ్ట్ ఎంత పనాయే..
ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను ఆసియాకప్‌లో మిగిలిన మ్యాచ్‌లలో బాధ్యతల నుంచి తప్పించాలని ఐసీసీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేసింది (Handshake Row).

ICC U Turn Small Win For Pakistan In Handshake Row report
Handshake Row : ఆసియాకప్ 2025 సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 14న)భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో, మ్యాచ్ పూరైన తరువాత భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. ఈ విషయాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను ఆసియాకప్‌లో మిగిలిన మ్యాచ్‌లలో బాధ్యతల నుంచి తప్పించాలని ఐసీసీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేసింది(Handshake Row).
ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో పీసీబీ పేర్కొంది.
Suryakumar Yadav : ఒమన్‌తో మ్యాచ్.. భారీ రికార్డు పై కన్నేసిన సూర్యకుమార్ యాదవ్..
అయితే.. పీసీబీ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. టీమ్ఇండియా ఆటగాళ్లు కరచాలనాలు చేయకపోవడంలో రిఫరీ ప్రమేయం ఏమీ లేదని, అతడిని తప్పించేది లేదని స్పష్టం చేసింది.
ఐసీసీ యూటర్న్..!
ఈ క్రమంలో కనీసం తమ మ్యాచ్‌ల వరకైనా ఆండీ పైక్రాఫ్ట్ ను దూరం పెట్టాలని, అతడి స్థానంలో రిచీ రిచర్డ్‌సన్‌కు రిఫరీ బాధ్యతలను అప్పగించాలని పీసీబీ మరోసారి కోరింది. ఇందుకు ఐసీసీ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. పాక్ జట్టు నేడు యూఏఈతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా సూపర్ 4లో అడుగుపెడుతుంది.
బహిష్కరించి ఉంటే..
ఆండీ పైక్రాఫ్ట్ ను ఆసియా కప్ నుంచి తప్పించకపోతే తాము వైదొలుగుతామని పీసీబీ తొలుత హెచ్చరించింది. అయితే.. ఆండీ పైక్రాఫ్ట్ తప్పించేది లేదని ఐసీసీ స్పష్టం చేసింది. చివరికి చేసేది లేక తమ మ్యాచ్‌ల వరకైనా అతడిని తప్పించాలని కోరింది.
ఒకవేళ ఆసియా కప్ నుంచి తప్పుకుంటే పాక్ కు రావాల్సిన ఆదాయ వాటా దక్కదు. పాక్ దాదాపు రూ.105 నుంచి 140 కోట్ల మేర నష్టపోవాల్సి ఉంటుందని అంచనా. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పీసీబీ ప్రస్తుతం అంత మొత్తాన్ని వదులుకునే స్థితిలో లేదు అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.