Muhammad waseem : చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. బట్లర్, కోహ్లీ, రోహిత్, ఫించ్, వార్నర్ రికార్డులకు బ్రేక్..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం (Muhammad waseem) చరిత్ర సృష్టించాడు.

Muhammad waseem becomes fastest ever to complete 3000 t20 runs
Muhammad waseem : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం అరుదైన ఘనత సాధించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా పొట్టి ఫార్మాట్‌లో 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆసియాకప్ 2025లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులతో రాణించడంతో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈక్రమంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ రికార్డును బ్రేక్ చేశాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ మూడు వేల పరుగులు చేయడానికి 2068 బంతులు తీసుకోగా వసీం (Muhammad waseem) కేవలం 1947 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. వీరిద్దరి తరువాతి స్థానాల్లో ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మలు ఉన్నారు.
Asia Cup 2025 : కరచాలన వివాదం.. ఆసియాకప్‌ను పాక్ బహిష్కరిస్తే.. ఏం జరుగుతుంది?
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 3వేల రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..
* ముహమ్మద్ వసీం (యూఏఈ) – 1947 బంతులు
* జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 2068
* ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) – 2078
* డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 2113
* రోహిత్ శర్మ (భారత్) – 2149
* విరాట్ కోహ్లీ (భారత్) – 2169
* మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్) – 2203
ఇన్నింగ్స్‌ల పరంగా..
ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే.. అత్యంత వేగంగా 3వేల పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అతడి కంటే ముందు రిజ్వాన్, కోహ్లీ, బాబర్‌లు ఉన్నారు
Asia cup 2025 : ఒమన్ పై యూఏఈ విజయం.. సూపర్4కి భారత్.. పాక్ కొంపమునిగింది
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా 3వేల రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..
* మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) – 79 ఇన్నింగ్స్‌ల్లో
* విరాట్ కోహ్లీ (భారత్) – 81
* బాబర్ ఆజామ్ (పాకిస్తాన్) – 81
* ముహమ్మద్ వసీం (యూఏఈ) – 84
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో వసీం (69), అలీషాన్ షరాఫు (51) లు హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 18.4 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో యూఏఈ 42 పరుగుల తేడాతో గెలుపొందింది.