Asia Cup 2025 : క‌ర‌చాల‌న వివాదం.. ఆసియాక‌ప్‌ను పాక్ బ‌హిష్క‌రిస్తే.. ఏం జ‌రుగుతుంది?

ఆసియాక‌ప్ 2025(Asia Cup 2025)లో భాగంగా యూఏఈతో జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ను పాక్ బ‌హిష్క‌రిస్తే.. అప్పుడు..

Asia Cup 2025 : క‌ర‌చాల‌న వివాదం.. ఆసియాక‌ప్‌ను పాక్ బ‌హిష్క‌రిస్తే.. ఏం జ‌రుగుతుంది?

Handshake Controversy What Will Happen If Pakistan Boycott Asia Cup 2025

Updated On : September 16, 2025 / 11:27 AM IST

Asia Cup 2025 : ఆసియాక‌ప్ 2025లో ఆదివారం (సెప్టెంబ‌ర్ 14న‌) భార‌త్‌, పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆట‌గాళ్లు పాక్ ప్లేయ‌ర్ల‌తో క‌ర‌చాల‌నానికి తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇందుకు బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్ రిఫ‌రీ పైక్రాఫ్ట్ ను తొల‌గించాల‌ని ఐసీసీని కోరింది. లేదంటే ఆసియాక‌ప్ 2025 (Asia Cup 2025)టోర్నీనే బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించింది.

ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై ఆసియా క్రికెట్‌ సంఘం (ఏసీసీ) కు పాక్ ఫిర్యాదు చేసింది. అదే స‌మ‌యంలో ఐసీసీ జోక్యాన్ని కూడా కోరుతుంది. కాగా.. ఇక్క‌డ పీసీబీ అధ్య‌క్షుడు అయిన మొహ్‌సిన్‌ నఖ్వినే ఏసీసీ అధ్యక్షుడు కావడం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఐసీసీ అధ్య‌క్షుడిగా జై షా ఉన్నారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే ఆసియాక‌ప్ అనేది ఐసీసీ టోర్న‌మెంట్ కాదు. దీనిని ఏసీసీనే నిర్వ‌హిస్తోంది.

Asia cup 2025 : ఒమ‌న్ పై యూఏఈ విజ‌యం.. సూప‌ర్‌4కి భార‌త్.. పాక్ కొంప‌మునిగింది

‘ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని మ్యాచ్ రిఫ‌రీ ఉల్ల‌ఘించారు. దీనిపై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. వెంట‌నే అత‌డిని ఆసియాక‌ప్‌లో మ్యాచ్ రిఫ‌రీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేశాం.’ అని న‌ఖ్వి సోష‌ల్ మీడియాలో తెలిపారు.

ఆసియాక‌ప్ 2025 పాక్ బ‌హిష్క‌రిస్తే ఏం జ‌రుగుతుంది?

త‌మ‌ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించిన పక్షంలో యూఏఈతో జరిగే తదుపరి మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ పాక్ ఈ టోర్నీ నుంచి త‌ప్పుకుంటే.. అప్పుడు దాని ప‌ర్య‌వ‌సానాలు తీవ్రంగా ఉంటాయి. సెప్టెంబ‌ర్ 17న యూఏఈతో పాక్ మ్యాచ్ ఆడ‌కుంటే.. ఆ మ్యాచ్‌లో యూఏఈని విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. అప్పుడు గ్రూపు-ఏ నుంచి భార‌త్‌, యూఏఈ జ‌ట్లు సూప‌ర్‌-4కి అర్హ‌త సాధిస్తాయి.

Suresh Raina : పాక్‌తో ఆడ‌డం భార‌త ఆట‌గాళ్ల‌కు ఇష్టం లేదు..

ఆసియాక‌ప్‌ నుంచి పాక్ త‌ప్పుకుంటే.. పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వ‌స్తుంది. అదే స‌మ‌యంలో బ్రాక్‌కాస్ట‌ర్లు, స్పాన్స‌ర్లు, టోర్న‌మెంట్ ఆర్గ‌నైజ‌ర్ల‌తో కుదుర్చుకున్న ఒప్పందాల‌ను ఉల్లంఘించినందుకు భారీ జ‌రిమానాల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుందని వార్త‌లు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే అప్పుడు పీసీబీ ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత ప్ర‌మాదంలో ప‌డ‌నుంది.

ఇప్పుడు ఐసీసీ ఏ నిర్ణ‌యం తీసుకుంటుంది. అందుకు పీసీబీ ఎలా స్పందిస్తుంది అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.