Asia cup 2025 : ఒమన్ పై యూఏఈ విజయం.. సూపర్4కి భారత్.. పాక్ కొంపమునిగింది
ఆసియాకప్ 2025(Asia cup 2025)లో ఒమన్ పై యూఏఈ విజయం సాధించడంతో అధికారికంగా భారత్ సూపర్-4కి అర్హత సాధించింది.

Bad News For Pakistan UAE Win Over Oman In Asia Cup
Asia cup 2025 : ఆసియాకప్ 2025లో భాగంగా అబుదాబి వేదికగా సోమవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూపు-ఏ నుంచి సూపర్-4కి భారత్ అధికారికంగా అర్హత సాధించింది. అదే సమయంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఒమన్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
రెండో జట్టు ఏది?
ఆసియాకప్ 2025లో(Asia cup 2025) ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్-4కి అర్హత సాధిస్తాయి అన్న సంగతి తెలిసిందే. గ్రూపు-ఏ నుంచి భారత్ అధికారికంగా అర్హత సాధించడంతో రెండో స్థానంలో ఏ జట్టు వెలుతుందని ఆసక్తి అందరిలో ఉంది.
Suresh Raina : పాక్‌తో ఆడడం భారత ఆటగాళ్లకు ఇష్టం లేదు..
గ్రూపు-ఏలో భారత్‌తో పాటు యూఏఈ, పాకిస్తాన్, ఒమన్‌లు ఉన్నాయి. ఒమన్ రేసు నుంచి నిష్ర్కమించగా భారత్ అర్హత సాధించడంతో రెండో స్థానం కోసం యూఏఈ, పాకిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. సెప్టెంబర్ 17న దుబాయ్ వేదికగా పాక్, యూఏఈ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సూపర్-4కి అర్హత సాధిస్తుంది. కాగా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూఏఈను ఓడించడం పాక్‌కు అంత సులువు కాదు.
అనిశ్చితికి మారు పేరు పాక్..
పాకిస్తాన్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఓ సారి అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ఆ తరువాతి మ్యాచ్‌లోనే చితికిల పడడం చూస్తూనే ఉంటాం. టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా చేతిలో ఓడిపోవడంతో ఆ టోర్నీ నుంచి పాక్ నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. ఆసియాకప్ 2025లో ఒమన్ పై గెలిచిన పాక్.. భారత్ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో యూఏఈతో పాక్ ఎలా ఆడుతుందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.