West Indies pacer Shannon Gabriel retires from international cricket
అంతర్జాతీయ క్రికెట్‌కు మరో ఆటగాడు గుడ్‌బై చెప్పేశాడు. నిన్న ఇంగ్లాండ్ స్టార్ డేవిడ్ మలన్ ఆటకు వీడ్కోలు పలకగా నేడు వెస్టిండీస్ పాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 36 ఏళ్ల ఈ ఆటగాడు 12 ఏళ్ల కెరీర్‌లో విండీస్ తరుపు మొత్తం 86 మ్యాచులు ఆడాడు. ఇందులో 59 టెస్టులు, 25 వన్డేలు, 2 టీ20లు ఉన్నాయి.
12 ఏళ్ల కెరీర్‌లో విండీస్ క్రికెట్ కోసం తనను తాను అంకితం చేసుకున్నాన్నట్లుగా చెప్పాడు. తనకెంతో ఇష్టమైన క్రీడను అత్యున్నత స్థాయిలో ఆడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలియజేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రం ఆడుతానని స్పష్టం చేశాడు.
Virat Kohli : శుభ్‌మన్ గిల్ పై కోహ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశాడా? అసలు నిజం ఇదే..
గాబ్రియెల్ పరిమిత ఓవర్ల ఆటలో కంటే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎక్కువగా రాణించాడు. 2012 లార్డ్స్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో అరంగ్రేటం చేశారు. 59 టెస్టుల్లో 32.21 సగటుతో 166 వికెట్లు తీశాడు. ఐదు వికెట్ల ప్రదర్శనను ఆరు సార్లు నమోదు చేశాడు. 2023లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్‌తో గాబ్రియెల్ చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 33, టీ20ల్లో మూడు వికెట్లు తీశాడు.