Virat Kohli : శుభ్‌మ‌న్ గిల్ పై కోహ్లీ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడా? అస‌లు నిజం ఇదే..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ సైతం డీప్ ఫేక్ వీడియో బారిన ప‌డ్డాడు.

Virat Kohli : శుభ్‌మ‌న్ గిల్ పై కోహ్లీ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడా? అస‌లు నిజం ఇదే..

Kohli Fake Video Blasting Shubman Gill Goes Viral

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అయితే.. దీన్ని స‌వ్యంగా వాడ‌క‌పోతే అంత‌కంటే ఎక్కువ‌గానే న‌ష్టాలు ఉంటాయి. కొంత‌మంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏఐని ఉప‌యోగించి ఫోటోలు, వీడియోలు డీప్ ఫేక్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దిగ్గ‌జ ఆట‌గాడు సచిన్ టెండూల్క‌ర్‌, న‌టి ర‌ష్మిక మందాన మార్ఫింగ్ వీడియోలు అప్ప‌ట్లో నెట్టింట వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ సైతం డీప్ ఫేక్ వీడియో బారిన ప‌డ్డాడు. కోహ్లీ మాట్లాడ‌ని మాట‌ల‌ను సైతం ఏఐ సాయంతో మాట్లాడిన‌ట్లుగా ఓ వీడియో క్రియేట్ చేశారు. ఇక ఈ వీడియోలో శుభ్‌మ‌న్ గిల్‌ను ఉద్దేశించి కోహ్లీ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా ఉంది.

Buchi Babu tournament : విఫ‌ల‌మైన శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఇలాగైతే టెస్టుల్లో చోటు క‌ష్ట‌మే?

ఆ వీడియో ఏం ఉందంటే..?

ఆసీస్ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత అత్యున్న‌త స్థాయిలో స‌క్సెస్ కావ‌డానికి ఏం చేయాలో గుర్తించిన‌ట్లు కోహ్లీ అన్నాడు. ఇక గిల్‌ను చాలా ద‌గ్గ‌రి నుంచి చూశాశ‌ని, అత‌డిలో నైపుణ్యం ఉందని చెప్పాడు. అందులో త‌న‌కు ఎలాంటి సందేహం లేదన్నాడు. అయితే..అత‌డు భ‌విష్య‌త్తు ఆట‌గాడిగా ఎదిగేందుకు, దిగ్గ‌జ ఆట‌గాడిగా మారేందుకు చాలా తేడా ఉంటుంద‌న్నాడు.

‘గిల్‌ టెక్నిక్ అద్భుతం. అత‌డు మ‌రో కోహ్లీ అవుతాడ‌ని చాలా మంది అంటున్నారు. అయితే.. అది ఎప్ప‌టికి సాధ్యం కాదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్ప‌టికీ ఒక్క‌డే. గ‌త ద‌శాబ్దం కాలంగా ఎంతో మంది క‌ఠిన‌మైన బౌల‌ర్ల‌ను ఎదుర్కొని నిల‌క‌డ‌గా ప‌రుగులు సాధించాను. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో స‌చిన్ టెండూల్క‌ర్‌, కోహ్లీలు మాత్ర‌మే బెంచ్ మార్క్‌ను సెట్ చేశారు. గిల్ ఈ స్థాయికి చేరుకోవాలంటే ఎంతో దూరం ప్ర‌యాణించాల్సి ఉంటుంది.’ అని కోహ్లీ ఆ వీడియోలో అన్న‌ట్లుగా ఉంది.

Asian Champions Trophy : ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త పురుషుల హాకీ జ‌ట్టు ఎంపిక

ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. దీనిపై కోహ్లీ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏఐతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు.