Buchi Babu tournament : విఫలమైన శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్.. ఇలాగైతే టెస్టుల్లో చోటు కష్టమే?
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లు విఫలం అయ్యారు.

Shreyas Iyer Suryakumar Yadav dismissed for low scores in Buchi Babu tournament
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లు విఫలం అయ్యారు. బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ముంబై తరుపున బరిలోకి దిగిన ఈ ఇద్దరు ప్లేయర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకున్నారు. తమిళనాడు జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ మూడు బంతులను ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేశాడు.
అటు సూర్య 38 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 30 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కానున్న రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో చోటు దక్కించుకోవాలని భావిస్తున్న సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లకు ఇది నిజంగా ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
Asian Champions Trophy : ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత పురుషుల హాకీ జట్టు ఎంపిక
ఈ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో బూపతి వైష్ణ కుమార్ (82), ప్రదోష్ రంజన్ పాల్ (65), ఇంద్రజిత్ బి (61), అజిత్ రామ్ (53) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై తొలి ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో దివ్యాన్ష్ సక్సెనా (57) అర్థశతకంతో రాణించాడు. మిగిలిన వారు విఫలం అయ్యారు. తమిళనాడు తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ముంబై ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది.
Jay Shah : ఐసీసీ ఛైర్మన్‌గా జైషా.. టీమ్ఇండియా క్రికెటర్ల శుభాకాంక్షల వెల్లువ