Jay Shah : ఐసీసీ ఛైర్మన్‌గా జైషా.. టీమ్ఇండియా క్రికెటర్ల శుభాకాంక్షల వెల్లువ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.

Kohli Bumrah congratulate Jay Shah for election as ICC Chairman
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ క్రమంలో ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమ్ఇండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ సహా పలువురు జైషా కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం తన కుటుంబ సమేతంగా లండన్‌లో ఉంటున్న కోహ్లీ.. జైషా మరెన్నో గొప్ప విజయాలను అందుకోవాలని ఆకాంక్షించాడు. క్రీడలపై షాకు ఉన్న అభిరుచిని బుమ్రా ప్రశంసించాడు. క్రికెట్‌ను అతను తదుపరి స్థాయికి తీసుకువెళ్తాడనే నమ్మకం ఉందని ట్వీట్ చేశాడు.
Zaheer Khan : లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్ ఖాన్.. ఎల్ఎస్‌జీ దశ తిరిగేనా..?
బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న 35 ఏళ్ల జైషా ఈ ఏడాది డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలో ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా షా రికార్డులకు ఎక్కాడు. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న గ్రెగ్ బార్క్‌లే పదవీ కాలం నవంబర్ 30తో ముగియనుంది. మూడోసారి ఈ పదవిలో కొనసాగేందుకు బార్క్‌లే ఇష్టపడలేదు.
భారత్ నుంచి ఇప్పటి వరకు నలుగురు ఐసీసీ ఛైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. జైషా ఐదోవాడు. ఐసీసీ ఛైర్మన్ల్‌గా ఆయన రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.
Sanjay Manjrekar : రోహిత్, కోహ్లీలపై మాజీ క్రికెటర్ మండిపాటు.. ఇంకెంత రెస్ట్ కావాలి?
ఐసీసీ ఛైర్మన్లుగా భారతీయులు..
జగ్మోహన్ దాల్మియా (1997 – 2000)
శరద్ పవార్ (2010 – 2012)
ఎన్.శ్రీనివాసన్ (2014 – 2015)
శశాంక్ మనోహర్ (2015 – 2020)
జై షా (2024*)
Many congratulations @JayShah on being elected as the ICC chairman. Wishing you great success ahead.
— Virat Kohli (@imVkohli) August 28, 2024
Heartiest Congratulations @JayShah https://t.co/F3PhVQQLud
— Rohit Sharma (@ImRo45) August 28, 2024
Congratulations @JayShah bhai! Your passion for the game will ensure it’s taken to the next level. Wishing you lots of luck! https://t.co/wzJvQWlhYd
— Jasprit Bumrah (@Jaspritbumrah93) August 28, 2024
Congratulations @JayShah bhai on being elected the youngest ever ICC Chairman! Your incredible vision and leadership skills will take cricket to new global heights. Wishing you all the best! https://t.co/SLzBgSI8Wa
— Ishan Kishan (@ishankishan51) August 28, 2024