Zaheer Khan : లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్ ఖాన్.. ఎల్ఎస్‌జీ దశ తిరిగేనా..?
టీమ్ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు.

Zaheer Khan appointed as mentor of Lucknow Super Giants
Zaheer Khan – LSG : టీమ్ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మెంటార్‌గా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని లక్నో జట్టు తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఐపీఎల్ 2025 నుంచి జహీర్ తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నాడు. కాగా.. గంభీర్ మెంటార్‌గా ఉన్న 2022, 2023 ఐపీఎల్ సీజన్లలో లక్నో జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్‌కు అతడు కేకేఆర్ వెళ్లిపోయాడు. ఈ సీజన్ ముగియగానే భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా.. గంభీర్ వెళ్లిపోవడంతో లక్నో ప్రదర్శన తీసికట్టుగా మారింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయింది. అదే సమయంలో ఆ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్న మోర్నీ మోర్కెల్ ఇప్పుడు సహాయక సిబ్బంది బృందంలో లేడు. అతడు ఇటీవల టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.
Sanjay Manjrekar : రోహిత్, కోహ్లీలపై మాజీ క్రికెటర్ మండిపాటు.. ఇంకెంత రెస్ట్ కావాలి?
ఈ క్రమంలో ఎంతో అనుభం ఉన్న జహీర్‌ఖాన్ ను లక్నో జట్టు తమ టీమ్‌లో చేర్చుకుంది. కోల్‌కతాలోని ఆర్పీఎస్‌జీ హెడ్‌క్వార్టర్స్ లో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో జహీర్ జెర్సీని కూడా లాంచ్ చేసింది. “మన ఎదురుచూపులు ఇక ముగిశాయి. కింగ్ ఆఫ్ రివర్స్ స్వింగ్, ఇండియన్ లెజెండ్ జహీర్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గా బాధ్యతలు తీసుకున్నాడు” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని లక్నో వెల్లడించింది.
ఐపీఎల్‌లో జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డేవిల్స్ తరుపు ఆడాడు. 100 మ్యాచుల్లో 102 వికెట్లు తీశాడు. 2017లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2018 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్‌లో వివిధ హోదాల్లో పని చేశాడు. రెండేళ్ల విరామం తరువాత మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నాడు.
Welcome to the Super Giants family, Zak! ? pic.twitter.com/0tIW6jl3c1
— Lucknow Super Giants (@LucknowIPL) August 28, 2024