Sanjay Manjrekar : రోహిత్, కోహ్లీల‌పై మాజీ క్రికెట‌ర్ మండిపాటు.. ఇంకెంత రెస్ట్ కావాలి?

బీసీసీఐ తీసుకున్న ఓ నిర్ణ‌యం పై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు, క్రికెట్ వ్యాఖ్యాత సంజ‌య్ మంజ్రేక‌ర్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

Sanjay Manjrekar : రోహిత్, కోహ్లీల‌పై మాజీ క్రికెట‌ర్ మండిపాటు.. ఇంకెంత రెస్ట్ కావాలి?

Sanjay Manjrekar Reacts To Kohli Rohit Bumrah Missing Duleep Trophy

బీసీసీఐ తీసుకున్న ఓ నిర్ణ‌యం పై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు, క్రికెట్ వ్యాఖ్యాత సంజ‌య్ మంజ్రేక‌ర్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్ ప్రీత్ బుమ్రాలను దులీప్‌ ట్రోఫీకి ఎంపిక చేయాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ ముగ్గ‌రు ఆట‌గాళ్లకి ఎంతో విశ్రాంతి ల‌భించింద‌న్నాడు.

శ్రీలంక ప‌ర్య‌ట‌న త‌రువాత భార‌త జ‌ట్టుకు 40 రోజుల సుదీర్ఘ విరామం దొరికింది. సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో భార‌త్ రెండు టెస్టు మ్యాచులు ఆడ‌నుంది. ఆ త‌రువాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు, ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌లు ఏడాది చివ‌ర‌ల్లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. అక్క‌డ ఐదు టెస్టు మ్యాచులు ఆడ‌నుంది. వ‌రుస టెస్టు సిరీస్‌ల నేప‌థ్యంలో సీనియ‌ర్ ఆట‌గాళ్లు అయిన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రాలకు గాయాలు కాకుండా వారి ప‌ని భారం దృష్ట్యా సెప్టెంబ‌ర్ 5 నుంచి ప్రారంభం కానున్న దేశ‌వాలీ దులీప్ ట్రోఫీకి ఈ ముగ్గురిని బీసీసీఐ ఎంపిక చేయ‌లేదు.

Shreyas Iyer : భార‌త జ‌ట్టుకు సునీల్ న‌రైన్ దొరికాడు..! ఇన్ని రోజులు ఈ క‌ల‌ను ఎక్క‌డ దాచావు అయ్య‌ర్‌..

దీనిపై మంజ్రేక‌ర్ మండిప‌డ్డాడు. గ‌త ఐదేళ్ల‌లో టీమ్ఇండియా ఎన్ని అంత‌ర్జాతీయ మ్యాచులు ఆడింది. ఇందులో ఈ ముగ్గురు ఎన్ని మ్యాచులు ఆడారు అనే విష‌యాల‌ను వివ‌రిస్తూ వారికి చాలా విశ్రాంతి ల‌భించింద‌ని చెప్పుకొచ్చాడు. ‘భార‌త జ‌ట్టు గ‌త ఐదేళ్ల‌లో 249 అంత‌ర్జాతీయ మ్యాచులు ఆడింది. ఇందులో రోహిత్ శ‌ర్మ 59 శాతం, కోహ్లీ 61 శాతం, బుమ్రా 34 శాతం మ్యాచులు మాత్ర‌మే ఆడారు. వాళ్లకు ఎంతో విశ్రాంతి ల‌భించింది. దులీప్ ట్రోఫీకి వాళ్లను ఎంపిక చేసి ఉండాల‌ని.’ చెబుతూ మంజ్రేక‌ర్ ట్వీట్ చేశాడు.

కాగా.. మంజ్రేక‌ర్ వాద‌న‌ను ప‌లువురు త‌ప్పుబ‌డుతున్నారు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు లోపు భార‌త్ 15 టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్ర‌పంచ‌క‌ప్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ పైన‌ల్‌లో ఆడాల్సి రావొచ్చు. ఈ క్ర‌మంలో ప్లేయ‌ర్లు గాయ‌ప‌డ‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే త‌ప్పేముంద‌ని మంజ్రేక‌ర్ పై ప‌లువురు మండిప‌డుతున్నారు.

Dawid Malan : అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు డేవిడ్ మ‌ల‌న్