West Indies register embarrassing record second Lowest Test innings totals
కింగ్‌స్టన్ వేదికగా ఆస్ట్రేలియా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీయగా స్కాట్ బొలాండ్ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో ఏడుగురు డకౌట్లు కావడం గమనార్హం. జస్టిన్ గ్రీవ్స్ (11) ఒక్కడే రెండు అంకెల స్కోరు సాధించారు.
టెస్టు క్రికెట్‌లో అత్యల్ప స్కోరు రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. 1955లో ఇంగ్లాండ్ పై ఓ ఇన్నింగ్స్‌లో కివీస్ 26 పరుగులకే కుప్పకూలింది. తృటిలో ఈ ఘోర రికార్డును వెస్టిండీస్ తప్పించుకుంది.
టెస్టు క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్లు ఇవే..
* న్యూజిలాండ్ – 26 పరుగులు – 1955లో ఇంగ్లాండ్ పై
* వెస్టిండీస్ – 27 పరుగులు – 2025లో ఆస్ట్రేలియాపై
* దక్షిణాఫ్రికా – 30 పరుగులు – 1896లో ఇంగ్లాండ్ పై
* దక్షిణాఫ్రికా – 30 పరుగులు – 1924లో ఇంగ్లాండ్ పై
* దక్షిణాఫ్రికా – 35 పరుగులు – 1899లో ఇంగ్లాండ్ పై
* దక్షిణాఫ్రికా – 36 పరుగులు – 1932లో ఆస్ట్రేలియా పై
* ఆస్ట్రేలియా – 36 పరుగులు – 1902లో ఇంగ్లాండ్ పై
* భారత్ – 36 పరుగులు – 2020లో ఆస్ట్రేలియాపై
* ఐర్లాండ్ – 38 పరుగులు – 2019లో ఇంగ్లాండ్ పై
* న్యూజిలాండ్ – 42 పరుగులు – 1946లో ఆస్ట్రేలియాపై
ఇక ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (48), కామెరూన్ గ్రీన్ (46) లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులు చేసింది. ఆ తరువాత వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియాకు 82 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ENG vs IND : లార్డ్స్‌లో భారత ఓటమిపై సునీల్ గవాస్కర్ కామెంట్స్.. జడేజా అలా చేసి ఉండొచ్చు..
ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌లో గ్రీన్ (42) రాణించడంతో ఆస్ట్రేలియా 121 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ ముందు 204 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 27 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 176 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.