Mitchell Starc : 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు.. 15 బంతుల్లో 5 వికెట్లు.. వందో మ్యాచ్‌లో చ‌రిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్‌..

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Mitchell Starc : 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు.. 15 బంతుల్లో 5 వికెట్లు.. వందో మ్యాచ్‌లో చ‌రిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్‌..

WI vs AUS Mitchell Starc took 5 wicket haul in just 15 balls fatest in test history

Updated On : July 15, 2025 / 10:42 AM IST

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా 5 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. త‌న కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించ‌డం విశేషం. ఈ క్ర‌మంలో త‌న సెంచ‌రీ మ్యాచ్‌ను చిర‌స్మ‌ర‌ణీయం చేసుకున్నాడు. కింగ్‌స్ట‌న్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన పింక్ బాల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 15 బంతుల వ్య‌వ‌ధిలోనే స్టార్క్ 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 7.3 ఓవర్లు వేసిన స్టార్క్‌ కేవలం 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఫలితంగా వెస్టిండీస్‌ 204 పరుగుల లక్ష్య ఛేదనలో 27 పరుగులకే కుప్ప‌కూలింది. దీంతో 176 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ గెలుపుతో ఆసీస్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

ENG vs IND : లార్డ్స్‌లో భార‌త ఓటమిపై సునీల్ గ‌వాస్క‌ర్ కామెంట్స్‌.. జ‌డేజా అలా చేసి ఉండొచ్చు..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225 ప‌రుగులు చేసింది. అనంత‌రం వెస్టిండీస్ 143 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఆసీస్‌కు 83 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 121 ప‌రుగులు చేసింది. దీంతో విండీస్ ముందు 204 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 5 వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 15 బంతులు – వెస్టిండీస్ పై 2025లో
* ఎర్నీ తోషాక్ (ఆస్ట్రేలియా) – 19 బంతులు – భార‌త్ పై 1947లో
* స్టువ‌ర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్‌) – 19 బంతులు – ఆస్ట్రేలియా పై 2015లో
* స్కాట్ బొలాండ్ (ఆస్ట్రేలియా) – 19 బంతులు – ఇంగ్లాండ్ పై 2021లో
* షేన్ వాట్స‌న్ (ఆస్ట్రేలియా) – 21 బంతులు – ద‌క్షిణాఫ్రికా పై 2011లో

Ravindra Jadeja : టీమ్ఇండియా ఓడిపోయినా.. ర‌వీంద్ర జ‌డేజా అరుదైన ఘ‌న‌త‌.. గంగూలీ, పంత్, ధోని లిస్ట్‌లో చోటు..

టెస్టుల్లో 400 వికెట్లు..

మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్‌లో మ‌రో ఘనత కూడా అందుకున్నాడు. టెస్ట్‌ల్లో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో ఈ మైలురాయిని అత్యంత త‌క్కువ బంతుల్లో చేరుకున్న రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ జాబితాలో ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు డేల్ స్టెయిన్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు 16634 బంతుల్లో టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. మిచెల్ స్టార్క్ 19062 బంతుల్లో ఈ ఘ‌న‌త సాధించాడు.