Ravindra Jadeja : టీమ్ఇండియా ఓడిపోయినా.. రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. గంగూలీ, పంత్, ధోని లిస్ట్‌లో చోటు..
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ ను గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు.

ENG vs IND 3rd Test Jadeja Joins Dhoni and Rishabh Pant In Elite List
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ ను గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. 193 పరుగుల లక్ష్య ఛేదనలో జడ్డూ అద్భతంగా ఆడాడు. 181 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే.. ప్రధాన బ్యాటర్ల వైఫల్యం, ఇంగ్లాండ్ బౌలర్ల క్రమశిక్షణ భారత్‌కు విజయాన్ని దూరం చేశాయి. ఇంగ్లాండ్ జట్టు 22 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయినప్పటి జడేజా ఓ అరుదైన ఘనత సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 7వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని , మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ఆటగాళ్లు ఉన్నటువంటి జాబితాలో చోటు సాధించాడు. 361 అంతర్జాతీయ మ్యాచ్‌లను జడ్డూ ఆడాడు. 302 ఇన్నింగ్స్‌ల్లో 33.41 సగటుతో 7018 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
83 టెస్టుల్లో 36.97 సగటుతో 3697 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 26 అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 175 నాటౌట్. 204 వన్డేల్లో 32.6 సగటుతో 2806 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 74 టీ20 మ్యాచ్‌ల్లో 21.4 సగటుతో 515 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ 50+స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గంగూలీతో కలిసి జడేజా సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ 5 మ్యాచ్‌ల్లో వరుసగా 50+స్కోర్లు సాధించగా, గంగూలీ, జడేజాలు చెరో నాలుగు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించారు.
లార్డ్స్ టెస్టు మ్యాచ్ స్కోరు వివరాలు..
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్.. 387
భారత తొలి ఇన్నింగ్స్.. 387
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్.. 192
భారత రెండో ఇన్నింగ్స్.. 170