ENG vs IND : మూడో టెస్టులో విజయం.. బెన్‌స్టోక్స్ కీలక వ్యాఖ్యలు.. అతడిని త్వరగా ఔట్ చేయడంతోనే ఈ గెలుపు.. లేదంటేనా..
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

Ben Stokes comments viral after england beat india in lords test
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. లార్డ్స్ వేదికగా భారత్ తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు, 77 పరుగులు చేయడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన రిషబ్ పంత్‌ను రనౌట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ సందర్భంగా స్టోక్స్ మాట్లాడుతూ.. లార్డ్స్‌లో విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ను త్వరగా ఔట్ చేయడంతోనే తాము గెలిచామన్నాడు.
ఇదొక గొప్ప విజయం అని అభివర్ణించాడు. జోఫ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు ఇక్కడే 2019 వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ విజయంలోనూ జోఫ్రా కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. అందుకనే ఐదో రోజు ఆటలో తాను జోఫ్రాతో కలిసి బౌలింగ్ చేశానన్నాడు. ఆర్చర్ ఏదో ప్రత్యేకమైంది చేస్తాడని తనకు అనిపించిందని, తాను ఊహించినట్లే రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మా వైపుకు తిప్పాడని చెప్పాడు.
టీమిండియాకు బిగ్‌షాక్.. నాల్గో టెస్టుకు రిషబ్ పంత్, బుమ్రా దూరం..! శుభ్‌మన్ గిల్ ఏం చెప్పాడంటే..?
Ben Stokes said, “Rishabh Pant’s wicket this morning was massive for us”. pic.twitter.com/vB7TauCmnv
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2025
నాలుగో రోజు ఆటలో బ్రైడన్ కార్స్ అద్భుతమైన స్పెల్ వేశాడు. మంచి రిథమ్‌తో దూకుడుగా బౌలింగ్ చేసినప్పటికి ఐదో రోజు ఫస్ట్ స్పెల్ జోఫ్రాతోనే వేయించాలని తన మనసు చెప్పినట్లుగా స్టోక్స్ వెల్లడించాడు. ఇక ఇదే విషయంపై డ్రెస్సింగ్ రూమ్‌లో సుదీర్ఘ చర్చలు జరిగినట్లు చెప్పుకొచ్చాడు. దేశం కోసం టెస్టు మ్యాచ్ గెలవడం మినహా ఇంకోటి లేదనే మనస్థత్వంతోనే బౌలింగ్ చేసినట్లుగా తెలిపాడు. ఇక స్పిన్నర్ షోయబ్ బషీర్ ఓ ఫైటర్ అని అన్నాడు. అతడు గాయంతోనే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు.
ఇక మ్యాచ్‌లో కీలకమైన స్పెల్ వేయడంతో పాటు వికెట్లు పడగొట్టడంపై స్పందిస్తూ.. తన ప్రదర్శన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు స్టోక్స్. రిషబ్ పంత్‌ను రనౌట్ చేయడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు. అతడు ఎంతటి డేంజరస్ బ్యాటరో అందరికి తెలుసు. ఐదో రోజు జోఫ్రా అతడిని తొందరగా ఔట్ చేశాడు. అతడు త్వరగా ఔట్ కావడం మాకు కలిసివచ్చింది. రెండు మేటి జట్లు తలపడినప్పుడు మ్యాచ్‌లు ఇలాగే ఉంటాయి. ఓ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుని నాలుగో టెస్టు మ్యాచ్ కోసం సిద్ధం అవుతాం అని బెన్‌స్టోక్స్ తెలిపాడు.