Mayank Agarwal : టీమ్ఇండియా క్రికెట‌ర్‌ మ‌యాంక్ అగ‌ర్వాల్‌కు ఏమైంది? హానిక‌ర ద్ర‌వం ఎందుకు తాగాడంటే?

టీమ్ఇండియా క్రికెట‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ తీవ్ర అస్వస్థ‌త‌కు గురి అయ్యాడు.

Mayank Agarwal

టీమ్ఇండియా క్రికెట‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ తీవ్ర అస్వస్థ‌త‌కు గురి అయ్యాడు. విమానంలో మంచినీళ్లు అనుకుని అత‌డు హానిక‌ర ద్ర‌వాన్ని తాగారు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌రలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంది.

ఏం జ‌రిగిందంటే..?

ప్ర‌స్తుతం మ‌యాంక్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్నారు. క‌ర్ణాట‌క కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. త్రిపుర‌లో జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం మంగ‌ళ‌వారం జ‌ట్టుతో క‌లిసి ఢిల్లీ వెళ్లేందుకు అగ‌ర్త‌ల‌లో విమానం ఎక్కాడు. త‌న సీటులో కూర్చుకున్నాడు. దాహం వేయ‌డంతో మంచినీళ్లు అనుకుని సీటుకు ముందు ఉన్న పౌచ్‌లోని ద్ర‌వాన్ని కొంచెం తాగాడు. వెంట‌నే అత‌డు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి అయ్యాడు. ప‌క్కన ఉన్న‌వారు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Sarfaraz Khan : టీమ్ఇండియాలో చోటు ద‌క్కిన త‌రువాత‌.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ మొద‌టి రియాక్ష‌న్ ఇదే..

అత‌డి గొంతులో వాపు, బొబ్బలు వ‌చ్చిన‌ట్లు వైద్యులు గుర్తించారు. వైద్యుల సూచ‌న‌తో అత‌డిని బెంగ‌ళూరుకు తీసుకువ‌చ్చే ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేష‌న్ తెలిపింది. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై మ‌యాంక్ అగ‌ర్వాల్ త‌న మేనేజ‌ర్ సాయంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ ఘటనపై త్రిపుర ఆరోగ్యశాఖ కార్యదర్శి కిరణ్ గట్టె మాట్లాడుతూ.. క్రికెట‌ర్‌ను ఎమర్జెన్సీలో చేర్చించి చికిత్స అందించిన‌ట్లు చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం అత‌డు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న‌ట్లు చెప్పారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించింది. అగ‌ర్త‌ల నుంచి ఢిల్లీ బ‌య‌లుదేరిన విమానంలో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ వ‌చ్చింది. దీంతో విమానం వెన‌క్కి వ‌చ్చింది. ప్ర‌యాణికుడికి వైద్య‌సాయం కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించాం. ఆ త‌రువాత విమానం బ‌య‌లుదేరింది. అని తెలిపింది.

Dean Elgar :కోహ్లీ నాపై ఉమ్మేశాడు.. నేను బ్యాట్‌తో కొడ‌తాన‌ని హెచ్చ‌రించా.. ఆ ఘ‌ట‌న జ‌రిగిన రెండేళ్ల త‌రువాత ఫోన్ చేసి..

ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా త‌రుపున మయాంక్ అగర్వాల్ 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 41.3 స‌గ‌టుతో 1488 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు శ‌త‌కాలు, ఆరు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఐదు వ‌న్డేల్లో 86 ప‌రుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో 123 మ్యాచులు ఆడిన మ‌యాంక్ 2597 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, 13 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. ప్ర‌స్తుత రంజీ సీజ‌న్‌లో త్రిపుర‌తో జ‌రిగిన మ్యాచులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 51,17 ప‌రుగులు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు