Pic: @IPL (X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో 19 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
చండీగఢ్‌లోని ముల్లన్పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ ఈ క్వాలిఫయర్ 1 మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోతే ఏం జరుగుతుందో తెలుసా?
Also Read: భారత్‌లో గూగుల్ స్టోర్ ప్రారంభం: Pixel ఫోన్లపై కళ్లుచెదిరే ఆఫర్లు.. ఇప్పుడే కొనేస్తే..
మ్యాచ్ రద్దయితే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌కి రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచు రద్దయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్‌కి వెళ్తుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో పంజాబ్ జట్టు అగ్రస్థానంలో ఉంది. పంజాబ్, బెంగళూరు జట్లకు పాయింట్ల పట్టికలో 19 చొప్పున పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్‌రేట్ పంజాబ్‌కి ఎక్కువగా ఉండడంతో ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
నేటి మ్యాచ్ రద్దయితే ఆ తర్వాత మే 30న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఆర్సీబీతో జూన్ 1న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫయర్ 2 గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్లి జూన్ 3న పంజాబ్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. ఇవాళ జరిగే మ్యాచు వర్షం కారణంగా రద్దయితే ఇలా జరుగుతుంది.