IND vs NZ : ఆదివారం భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ ఐదో టీ20 మ్యాచ్‌.. జియోలో రాదు.. మ‌రీ ఎక్క‌డ చూడాలంటే?

IND vs NZ : హామిల్టన్ వేదిక‌గా ఆదివారం (న‌వంబ‌ర్ 1) భార‌త్ vs న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

When And Where To Watch IND vs NZ 5th T20 Match

IND vs NZ : హామిల్టన్ వేదిక‌గా ఆదివారం (న‌వంబ‌ర్ 1) భార‌త్ vs న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించ‌గా ఆక్లాండ్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఈ నేప‌థ్యంలో ఆదివారం జ‌రిగే చివ‌రి మ్యాచ్‌లో గెలిచి వ‌న్డే సిరీస్‌కు ఆత్మ‌విశ్వాసం ప్రోదిచేసుకోవాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవ‌కాశం ఉంది.

ఎక్క‌డ చూడొచ్చంటే?

ఈ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్ర‌కారం 12.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్‌ జియో హాట్‌స్టార్‌లో రాదు. ఈ సిరీస్ ప్ర‌సార హ‌క్కుల‌ను సోనీ నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉంది. ఈ క్ర‌మంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానున్నాయి. ఓటీటీలో అయితే.. సోనీ లివ్ యాప్‌, వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

Tilak Varma : ఆదివారం భార‌త్ vs న్యూజిలాండ్ ఐదో టీ20 మ్యాచ్‌.. భారీ రికార్డుపై తిల‌క్ వ‌ర్మ క‌న్ను..

తుది జ‌ట్ల అంచ‌నా..

న్యూజిలాండ్ జ‌ట్టు..
ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్
భార‌త జ‌ట్టు..
అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.