×
Ad

IND vs ZIM : ఇషాన్ కిష‌న్‌కు 4, అభిషేక్ శ‌ర్మకు 2 ఏళ్లు.. జింబాబ్వే చివ‌రిసారిగా భారత్‌తో భార‌త‌దేశంలో ఆడిన‌ప్పుడు..

చివ‌రిసారిగా భార‌త్, జింబాబ్వే జ‌ట్లు (IND vs ZIM) భార‌తదేశంలో ఎప్పుడు త‌ల‌ప‌డ్డాయో మీకు తెలుసా?

When was last time india and zimbabwe played in India

IND vs ZIM : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భార‌త్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఈ మెగాటోర్నీలో భార‌త్‌కు ఇదే తొలి ఓట‌మి అయిన‌ప్ప‌టికి కూడా టీమ్ఇండియా సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి.

భార‌త జ‌ట్టు సెమీస్ చేరుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌ల్లో భారీ తేడాతో విజ‌యాల‌ను సాధించాలి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌ను గురువారం జింబాబ్వే ఆడ‌నుంది భార‌త్. ఈ మ్యాచ్‌లో గ‌నుక భార‌త్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన‌ట్లే. ఈ మెగాటోర్నీలో జింబాబ్వే అంచ‌నాల‌ను మించి రాణిస్తోంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక‌ల‌పై విజ‌యాల‌ను సాధించింది.

Sunil Gavaskar : ద‌క్షిణాఫ్రికాపై ఓట‌మి.. భారత బ్యాట‌ర్ల పై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం.. అభిషేక్ శ‌ర్మ నువ్వు అస‌లు..

అయితే.. ఇక్క‌డ ఆసక్తిక‌ర విష‌యం ఏమిటంటే.. 2002 నుంచి భార‌తదేశంలో టీమ్ఇండియాతో జింబాబ్వే ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. ఈ క్ర‌మంలో ఇప్పుడు అంద‌రి దృష్టి జింబాబ్వే, భార‌త్ పోరుపైనే ఉంది.

భార‌త్‌లో టీ20 మ్యాచ్ ఆడ‌లేదు..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య ఒకే ఒక టీ20 మ్యాచ్ జ‌ర‌గింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన నాటి మ్యాచ్‌లో భార‌త్ 71 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఇక జింబాబ్వే జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త‌దేశంలో భార‌త్ తో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడ‌లేదు.

2002 మార్చి 19న గౌహ‌తి వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో జింబాబ్వే, భార‌త్‌లు చివ‌రి సారిగా భార‌తదేశంలో త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 6 వికెట్ల న‌ష్టానికి 333 ప‌రుగులు చేయ‌గా.. జింబాబ్వే 232 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

IND vs SA : నిజం చెప్పొద్దు.. మేం గెల‌వ‌డానికి అదొక్క‌టే కార‌ణం.. ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్ హాట్‌ కామెంట్స్‌..

అప్పుడు ఇషాన్, అభిషేక్ వయస్సు ఎంతో తెలుసా?
రెండు జట్లు చివరిసారిగా భారతదేశంలో తలపడినప్పుడు ఇద్దరు ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ లు ఇద్ద‌రు చాలా చిన్న‌వారు. ఇషాన్ కిషన్ 18 జూలై 1998న జన్మించాడు. అంటే అతనికి దాదాపు 4 సంవత్సరాలు. అభిషేక్ శర్మ సెప్టెంబర్ 4, 2000న జన్మించాడు. అంటే అత‌డికి కేవ‌లం 2 సంవత్సరాలు