రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు గులాబీ జెర్సీ ఎందుకు వేసుకున్నారో తెలుసా?

ఈ మ్యాచ్ లో మొత్తం 13 సిక్స్ లు నమోదయ్యాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఫౌండేషన్ 78 ఇళ్లకు సౌర విద్యుత్ ను అందించనుంది.

Rajasthan Royals

Rajasthan Royals : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ జట్టు వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆర్సీబీ జట్టు వరుసగా నాల్గో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంకు పడిపోయింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కోహ్లీ 113 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. డూప్లెసిస్ 44 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఆ తరువా బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు బ్యాటర్లు ప్రారంభం నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు.

రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే జైస్వాల్ డకౌట్ అయ్యాడు. ఆ తరువాత బట్లర్ (100 నాటౌట్), సంజు శాంసన్ (69) వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆర్ఆర్ జట్టు 189 పరుగులు చేసి విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు పూర్తిగా గులాబీ రంగు జెర్సీని ధరించారు. ఇలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది.

Also Read : రోహిత్ శర్మ పాదాలను తాకిన మహిళా అభిమాని.. హిట్‌మ్యాన్‌ ఏం చేశాడంటే..? వీడియో వైరల్

రాజస్థాన్ మహిళల సాధికారతకోసం ఆ ప్రాంఛైజీ కృషి చేస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న మహిళలకు మద్దతుగా నిలుస్తోంది. ఇందులో భాగంగా పింక్ ప్రామిస్ పేరుతో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నీరు, సోలార్ విద్యుత్ అందించడంతో పాటు మహిళల మానసిక ఆరోగ్యం విషయంలో సాయంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్ లో నమోదైన ఒక్కో సిక్సర్ కు ఆరు ఇళ్లకు పౌర విద్యుత్ అందిస్తామని రాజస్థాన్ యాజమాన్యం ప్రకటించింది. అలాగే ఈ గులాబీ జెర్సీల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం డబ్బు, ఈ మ్యాచ్ కు అమ్ముడైన ఒక్కో టికెట్ నుంచి రూ. 100 చొప్పున విరాళంగా ఇవ్వనుంది. ఈ మ్యాచ్ లో మొత్తం 13 సిక్స్ లు నమోదయ్యాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఫౌండేషన్ 78 ఇళ్లకు సౌర విద్యుత్ ను అందించనుంది.

Also Read : IPL 2024 : చెలరేగిన బట్లర్, శాంసన్.. బెంగళూరుపై రాజస్థాన్ విజయ దుందుభి

 

ట్రెండింగ్ వార్తలు