Rohit Sharma (Courtesy BCCI)
IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరిలో లక్నో బౌలర్లు అద్భుత బౌలింగ్ చేయడంతో 12 పరుగుల తేడాతో ఆ జట్టు విజేతగా నిలిచింది. దీంతో ఈ టోర్నీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన లక్నో జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన ముంబై జట్టు మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది.
Also Read: IPL 2025 : ఉత్కంఠ పోరులో ముంబైపై లక్నో విజయం
ఐపీఎల్ 2025లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో 0, 8, 13 పరుగులు మాత్రమే చేశాడు. గత మ్యాచ్ లో రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించారు. దీంతో రోహిత్ కేవలం బ్యాటింగ్ కు మాత్రమే మైదానంలోకి వచ్చాడు. అయినా పరుగులు రాబట్టలేక పోయాడు. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడలేదు. దీంతో అతన్ని పక్కన పెట్టారని, సీనియర్ ఆటగాడి పట్ల ముంబై యాజమాన్యం నిర్ణయం సరైంది కాదంటూ సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: SRH vs KKR : కోల్‌కతా కుమ్మేసిందిగా.. బౌలర్ల దెబ్బకు విలవిల.. హైదరాబాద్‌కు హ్యాట్రిక్ ఓటమి..!
రోహిత్ శర్మ లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఆడకపోవటానికి ప్రధాన కారణం ఉందంట. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని మోకాలికి బంతి తగలడంతో స్వల్ప గాయమైందట. దీంతో తుది జట్టులో రోహిత్ శర్మకు అవకాశం దక్కలేదని జట్టు వర్గాలు తెలిపాయి. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్ శర్మ పలు సార్లు మైదానంలోకి వచ్చి కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సూచనలు చేయడం కనిపించింది. దీనికితోడు డగౌట్ లో కూర్చొని ఉన్న సమయంలో రోహిత్ నవ్వుతూ కనిపించాడు. దీంతో అతన్ని ముంబై యాజమాన్యం పక్కన పెట్టలేదని, కేవలం మోకాలిలో ఇబ్బంది ఉండటం వల్లనే మ్యాచ్ కు దూరమయ్యాడని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. తరువాత మ్యాచ్ కు రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తే కానీ ఈ సందేహాలకు తెరపడవు.