Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైంది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ అభిమానులను అలరించింది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కేకేఆర్‌ను ఆర్‌సీబీ ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 నష్టపోయి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే (56; 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా సునీల్ నరైన్ (44; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు, జోష్ హేజిల్‌వుడ్ రెండు, యష్ దయాల్, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం ఆర్‌సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (59 నాటౌట్; 36బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్సర్లు), సాల్ట్ (56; 31బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) లతో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ (34; 16 బంతులు ) దంచికొట్టడంతో 16.2 ఓవర్లలో మూడు వికెట్లు బెంగళూరు లక్ష్యాన్ని అందుకుంది.
నరైన్ హిట్ వికెట్..
ఇక ఈమ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 169.23 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేసిన సునీల్ నరైన్ బ్యాట్ వికెట్లను తాకింది. బెయిల్స్ సైతం కిందపడిపోయాయి. అయినప్పటికి అతడిని హిట్ వికెట్‌గా ఔట్ ఇవ్వలేదు. దీంతో స్టేడియంలోని అభిమానులతో పాటు టీవీల్లో, ఫోన్లలో మ్యాచ్ చూస్తున్న అభిమానులు ఆశ్చర్యపోయారు. కాగా.. అంపైర్ ఎందుకు ఔట్ ఇవ్వలేదు అనే విషయం చాలా మందికి అర్థం కాలేదు.
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 22, 2025
ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌ను ఆర్‌సీబీ బౌలర్ రసిఖ్ సలాం దార్ బౌన్సర్‌గా వేశాడు. లెగ్ అంపైర్ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. అప్పటికే వికెట్ కీపర్ జితేష్ శర్మ బంతిని సేకరించాడు. దీంతో ఆ బంతి డెడ్ బాల్ కిందకు వస్తుంది. ఇక సునీల్ నరైన్ సైతం డెలివరీ యాక్షన్‌ను పూర్తి చేయడంతో అంపైర్ హిట్‌వికెట్‌గా ప్రకటించలేదు.
క్రికెట్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..?
ఎంసీసీ నియమాల ప్రకారం.. ఓ బ్యాటర్ బంతిని ఆడుతున్నప్పుడు లేదా పరుగు కోసం స్టార్ట్ అవుతున్నప్పుడు లేదా వికెట్‌ను కాపాడుకోవడానికి రెండవ హిట్ చేస్తున్నప్పుడు బ్యాట్ స్టంప్‌లను తగిలితే అప్పుడు మాత్రమే.. ఆ బ్యాటర్‌ను హిట్‌వికెట్‌గా పరిగణిస్తారు. షాట్ ఆడిన తర్వాత లేదా డెలివరీ పూర్తయిన తర్వాత బ్యాట్ స్టంప్‌లను తాకితే దాన్ని హిట్ వికెట్‌గా పరిగణించరు.
What just happened there? 👀#RCB fans, was that OUT or NOT? 🤔
Watch LIVE action: https://t.co/iB1oqMusYv #IPLonJioStar 👉 KKR🆚RCB, LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FUK5q0hDGR
— Star Sports (@StarSportsIndia) March 22, 2025
KKR vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓటమికి కారణాలు చెప్పిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే..
కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్‌లో అప్పటికే బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అంపైర్ వైడ్ ప్రకటించడంతో నరైన్ నాటౌట్‌గా నిలిచాడు.