×
Ad

IND vs WI 2nd Test : భార‌త్‌తో రెండో టెస్టు.. చేతికి నల్లటి బ్యాండ్‌లు ధ‌రించి బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ ఆట‌గాళ్లు.. ఎందుకో తెలుసా?

భార‌త్‌తో ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs WI 2nd Test) వెస్టిండీస్ ఆట‌గాళ్లు చేతికి న‌ల్లటి బ్యాండ్‌లు ధ‌రించి బ‌రిలోకి దిగారు.

Why West Indies wearing black armbands during second Test against India

IND vs WI 2nd Test : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆట‌గాళ్లు చేతికి న‌ల్లటి బ్యాండ్‌లు ధ‌రించి బ‌రిలోకి దిగారు.

వెస్టిండీస్ మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు బెర్నార్డ్ జూలియన్ ఈ నెల ప్రారంభంలో మ‌ర‌ణించారు. ఆయ‌నకు నివాళిగా విండీస్ న‌ల్ల బ్యాండ్ల‌తో బ‌రిలోకి దిగింది.

IND W : ద‌క్షిణాఫ్రికా చేతిలో ఓట‌మి.. భార‌త్‌ సెమీస్‌కు చేరాలంటే..?

బెర్నార్డ్ జూలియన్ ఎవరు?

వెస్టిండీస్ త‌రుపున అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 1973లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో అరంగ్రేటం చేశారు బెర్నార్డ్ జూలియన్ (Bernard Julien). వెస్టిండీస్‌ త‌రుపున 24 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో 866 పరుగులు చేయ‌డంతో పాటు 50 వికెట్లు తీశాడు. వ‌న్డేల్లో 86 ప‌రుగుల‌తో పాటు 18 వికెట్లు సాధించారు. 1975లో జ‌రిగిన తొలి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను వెస్టిండీస్ సొంతం చేసుకోవ‌డంలో బెర్నార్డ్ జూలియన్ కీల‌క పాత్ర పోషించాడు.

Shubman Gill : నువ్వు టాస్ గెలిచావురా.. శుభ్‌మ‌న్ గిల్‌ను ఆటప‌ట్టించిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు.. వీడియో వైర‌ల్..

ఇక భార‌త్ వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ (IND vs WI 2nd Test) విష‌యానికి వ‌స్తే.. తొలి రోజు లంచ్ విరామానికి భార‌త్ వికెట్ న‌ష్టానికి 94 ప‌రుగులు చేసింది. క్రీజ్‌లో యశస్వి జైస్వాల్ (40), సాయి సుదర్శన్ (16) లు ఉన్నారు. అంత‌క‌ముందు ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (38) వారిక‌న్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. తొలి వికెట్‌కు జైస్వాల్, రాహుల్ లు 58 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు.