Third Umpire Mistake: రనౌట్ కోరితే..స్క్రీన్‌పై మ్యూజిక్ షేర్ చేసిన థర్డ్ అంపైర్

మ్యాచ్ రసవత్తంగా జరుగుతున్న సమయంలో యాడ్స్ వస్తేనే విసుగ్గా అనిపిస్తుంది. అలాంటిది థర్డ్ అంపైర్ డెసిషన్ కోసం ఎదురుచూస్తుంటే ఆ స్క్రీన్ పై సాంగ్స్ ప్లే

Third Umpire

Third Umpire Mistake: మ్యాచ్ రసవత్తంగా జరుగుతున్న సమయంలో యాడ్స్ వస్తేనే విసుగ్గా అనిపిస్తుంది. అలాంటిది థర్డ్ అంపైర్ డెసిషన్ కోసం ఎదురుచూస్తుంటే ఆ స్క్రీన్ పై సాంగ్స్ ప్లే లిస్ట్ కనిపిస్తే.. ఎలా ఉంటుంది. ఇక్కడ విసుగురాలేదు. కానీ, అందరూ నవ్వేసుకున్నారు. పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో విండీస్ జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. విండీస్‌ ఇన్నింగ్స్‌ జరుగుతుండగా.. ఇన్నింగ్స్‌ 77వ ఓవర్‌లో విండీస్‌ కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ రనౌట్‌ పై క్లారిటీ కోసం థర్ఢ్‌ అంపైర్‌ను ఆశ్రయించారు.

బ్రాత్‌వైట్‌ 97 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న సమయమది. రిప్లేలో బ్రాత్‌వైట్‌ అవుట్ అయినట్లు కనిపించింది. సాంప్రదాయం ప్రకారం.. రరివ్యూను బిగ్ స్క్రీన్ పై షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారమే అంపైర్‌ డెసిషన్‌ కోసం స్ర్కీన్‌ వైపే చూస్తుండగా.. స్ర్కీన్‌పై మ్యూజిక్‌ ఆల్బమ్‌ కనిపించింది. మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకుల మొహాల్లోనూ నవ్వులు విరిశాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. పాక్‌ నిర్దేశించిన 168 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు తడబడినప్పటికీ.. ఆఖర్లో కీమర్ రోచ్ (52 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 142 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. జోమెల్ వారికన్, జేడెన్ సీల్స్ అండతో రోచ్ జట్టును గట్టెక్కించాడు. ఈ విజయంతో విండీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగష్టు 20న స్టార్ట్ అవుతుంది.