Wimbledon : వింబుల్డన్ మహిళల విజేతగా ఆష్ బార్టీ

వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ ఆష్ బార్టీ మహిళల సింగిల్స్‌లో చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది.

Wimbledon

Wimbledon : వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ ఆష్ బార్టీ మహిళల సింగిల్స్‌లో చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కారు.

41 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ఎవానీ గూలగోంగ్ వింబుల్డన్ ఫైనల్ కు చేరి విజేతగా నిలిచారు. 41 ఏళ్లలో ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్‌ కూడా వింబుల్డన్ ఫైనల్ చేరలేకపోయారు. గురువారం జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఆష్ బార్టీ ఫైనల్ కి చేరారు.

శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆమె విజయం సాధించి చరిత్ర సృష్టించారు. చెకియాకు చెందిన కె. ప్లిస్కోవాతో తలపడిన ఆష్ బార్టీ 6-0, 6-7(4/7), 6-3 తో విజయం సాధించారు.