Womens ODI World Cup 2025 : మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌.. చ‌రిత్ర‌లోనే తొలిసారి ఇలా.. అంద‌రూ మ‌హిళ‌లే..

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025(Womens ODI World Cup 2025)కు మొత్తం మ‌హిళా అధికారుల‌తో కూడిన బృందాన్ని ఐసీసీ ప్ర‌క‌టించింది.

Womens ODI World Cup 2025 ICC Unveil First Ever All Female Officiating Line Up

Womens ODI World Cup 2025 : సెప్టెంబ‌ర్ 30 నుంచి మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2025 ప్రారంభం కానుంది. భార‌త్, శ్రీలంక దేశాలు ఈ మెగాటోర్నీ(Womens ODI World Cup 2025)కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఐసీసీ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మెగాటోర్నీ కోసం మ‌హిళా అధికారుల‌తో కూడిన బృందాన్ని ప్ర‌క‌టించింది. ఇది మ‌హిళ‌ల క్రికెట్ అభివృద్ధి దిశ‌గా ఇది మ‌రో అడుగుగా చెప్ప‌వ‌చ్చు.

ఈ మెగా టోర్నీ కోసం 14 మంది మ‌హిళా అంపైర్లు, న‌లుగురు మ‌హిళా మ్యాచ్ రిఫ‌రీల‌ను ప్ర‌కటించింది. కాగా.. మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో మొత్తం మ‌హిళా అధికారుల‌నే నియ‌మించ‌డం ఇదే తొలిసారి. ఐసీసీ అధ్య‌క్షుడు జై షా ఈ చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

Kuldeep Yadav : టీ20ల్లో కుల్దీప్ యాద‌వ్ అరుదైన ఘన‌త‌..

మొత్తం మహిళా మ్యాచ్ అధికారుల ప్యానెల్‌ను చేర్చడం ఒక ప్రధాన మైలురాయి మాత్రమే కాదు.. క్రికెట్ అంతటా లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి ICC యొక్క అచంచలమైన నిబద్ధతకు నిద‌ర్శ‌నం అని జైషా అన్నారు.


ట్రూడీ ఆండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్ , జి.ఎస్. లక్ష్మి, మిచెల్ పెరెరాలు మ్యాచ్ రిఫ‌రీలు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

అంపైర్లు వీరే..

లారెన్ అగెన్‌బాగ్, కాండేస్ లా బోర్డే, కిమ్ కాటన్, సారా దంబనేవానా, షాతీరా జాకీర్ జెస్సీ, కెర్రిన్ క్లాస్టే, జననీ ఎన్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, బృందా రాఠీ, స్యూ రెడ్‌ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, గాయత్రి వేణుగోపాలన్, జాక్వెలైన్స్.

IND vs UAE : థ‌ర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చినా.. బ్యాటింగ్ కొన‌సాగించిన‌ యూఏఈ బ్యాట‌ర్‌.. అస‌లేం జ‌రిగిందంటే?

భార‌త్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో భార‌త్ త‌న తొలి మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 30న శ్రీలంక‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌కు గౌహ‌తి వేదిక కానుంది. ఇక చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అక్టోబ‌ర్ 5న జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు కొలంబో అతిథ్యం ఇవ్వ‌నుంది. పాక్ జ‌ట్టు ఆడే మ్యాచ్‌లు అన్ని కొలంబో వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి.