Womens ODI World Cup
Womens World Cup : మన అమ్మాయిలు అదరగొట్టేశారు. చరిత్ర సృష్టించారు. భారత్‌ను విశ్వ విజేతగా నిలబెట్టారు. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ను టీమిండియా మహిళా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. యువ ఓపెనర్ షెఫాలి వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మందాన (45), రిచా ఘోష్ (34) రాణించారు. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ చెలరేగిపోయింది. 5 వికెట్లు తీసి సౌతాఫ్రికా జట్టును గట్టి దెబ్బ కొట్టింది. భారత్ విజయంలో కీ రోల్ ప్లే చేసింది. షెఫాలీ వర్మ 2 వికెట్లు తీసింది. శ్రీ చరణి ఒక వికెట్ పడగొట్టింది.
మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్యాచ్ ఇదే..
ఫైనల్ మ్యాచ్‌లో అమ్మాయిలు అదరగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా జట్టును చిత్తుచేసి జగజ్జేతలుగా నిలిచారు. అయితే, ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ ఏమిటంటే.. అమన్ జ్యోత్ కౌర్ పట్టిన అద్భుత క్యాచ్. దక్షిణాఫ్రికా గెలవాలంటే 54 బంతుల్లో 79 పరుగులు చేయాల్సి ఉంది. అయినా ఆ జట్టు ధీమాగా ఉంది. ఎందుకంటే.. సెంచరీ చేసిన కెప్టెన్ లారా వోల్వార్ట్ క్రీజులో ఉండటమే కారణం. వోల్వార్ట్ బ్యాటుతో విరుచుకుపడితే మ్యాచ్ సునాయాసంగా దక్షిణాఫ్రికా చేతుల్లోకి వెళ్లిపోతుంది. అలాంటి సమయంలో దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్ 42వ ఓవర్లో వోల్వార్ట్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించింది. డీప్‌మిడ్ వికెట్‌లోకి బంతి గాల్లోకి లేచింది. దూసుకొచ్చిన అమన్ జ్యోత్ మొదట బంతిని పట్టేసినట్లే పట్టి విడిచిపెట్టింది. వెంటనే తేరుకుని మళ్లీ ప్రయత్నించింది. ఈసారీ బంతి చేతిలో చిక్కలేదు. చివరికి బంతి నేలను తాకే సమయంలో అమన్ జ్యోేేత్ డ్రైవ్ చేసి బంతిని అందుకుంది. ఈ అద్భుత క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఈ క్యాచ్ తరువాత టీమిండియా విజయం ఖాయమైంది. అయితే, 1983 ప్రపంచ కప్‌లో వివ్ రిచర్ట్స్ క్యాచ్‌ను కపిల్ ఇలాగే పట్టి మ్యాచ్‌ను ములుపు తిప్పాడు. దీంతో అప్పుడు కపిల్.. ఇప్పుడు అమన్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
Reminds us of the Surya Moment catching a spectacular catch.
But not taking away the moment created by Amanjot.
Womens world cup
The Indian women’s team clinches the victory from South Africa.
Sorry South African team. pic.twitter.com/cw1h3j6IBH
— Vikram Mailar Vijay (@Vikrammailar) November 3, 2025