Women’s World Cup 2022 : వెస్టిండీస్‌‌పై భారత్ ఘన విజయం..చెలరేగిన స్మృతి, హర్మన్ ప్రీత్

బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మహిళల టీం.. చతికిలపడింది. 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత ఉమెన్స్ టీం.. 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది...

India Won The Match Against West Indies : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య మరో పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మిథాలీ టీం ప్రపంచ కప్ పోటీల్లో భారత్ రెండో మ్యాచ్ గెలిచినట్లైంది. భారత మహిళల ఓపెనర్ స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగిపోయారు. వెస్టిండీస్ మహిళా బౌలర్లను వీరు చీల్చి చెండాడడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మహిళల టీం.. చతికిలపడింది. 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత ఉమెన్స్ టీం.. 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Read More : England vs India : మిథాలీ టీం రెడీ..భారత్ – ఇంగ్లాండ్ ఏకైక టెస్టు

ఐసీసీ మహిళ వన్డే ప్రపంచకప్ ను కైవసం చేసుకోవాలనే ఆత్మవిశ్వాసంతో భారత జట్టు బరిలోకి దిగింది. తొలుపోరులో పాక్ పై గెలిచి అదే జోరుతో రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొంది. అయితే.. మిథాలీ సేనకు చుక్కెదురైంది. కివీస్ చేతిలో పరాజయం చెందింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. హమిల్టన్ లో వెస్టిండీస్ జట్టుతో మూడో మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన భారత్ టీం.. ఏ మాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన వెస్టిండీస్ టీం… ఓపెనర్లు డియాండ్ర డాటిన్, హేలీ మ్యాథ్యూస్ ధాటిగా ఆడారు.

Icc Womens

Read More : ICC Women’s World Cup : ప్రపంచకప్‌‌లో బోణీ కొట్టిన భారత్.. పాక్ పరాజయం, చుక్కలు చూపించిన రాజేశ్వరి

భారత మహిళా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. వచ్చిన బంతులను బౌండరీలకు తరలించడంతో భారత బౌలర్లు చేతులెత్తేశారు. దాదాపు 12 ఓవర్లకే వెస్టిండీస్ జట్టు 100 పరుగులు దాటింది. కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న వీరిని విడగొట్టాలని భారత బౌలర్లు రెచ్చిపోయారు. హాఫ్ సెంచరీ సాధించిన డాటిన్ (62)ను స్నేహ్ రానా అవుట్ చేశారు. మాథ్యూస్ కు జతగా ఏ ఒక్కరూ నిలబడలేపోయారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టపటపా వికెట్లు నేలకూలాయి. ఓపెనర్లతో పాటు మిగతా వారిని వరుసగా పెవిలియన్ పంపారు. మాథ్యూస్ (43) ఒంటరి పోరాటం వృధా అయ్యింది. దీంతో 40.3 ఓవర్లలలోనే 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 155 పరుగులతో తేడాతో ఘన విజయం సాధించింది.

Read More : Women’s World Cup : పాక్ టార్గెట్ 245.. భారత్ మిడిలార్డర్ ఫెయిల్.. రాణించిన మంధన

అంతకుముందు…భారత్ ఓపెనర్ స్మృతి మందన ఆది నుంచి చెలరేగిపోయి ఆడారు. యాస్తికా బాటియా స్మృతికి చక్కని సహకారం అందించింది. జట్టు స్కోరు 50 పరుగులు చేరుతుందనగా.. బాటియా 31 పరుగులు సాధించి వెనుదిరిగింది. అనంతరం కెప్టెన్ మిథాలీ రాజ్ వచ్చారు. ఈసారి చెలరేగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ తక్కువ స్కోరు (5)కే వెనుదిరగడంతో అభిమానులు మరోసారి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అప్పటికీ జట్టు స్కోరు 58 పరుగులే. తర్వాత వచ్చిన దీప్తి శర్మ (15) కూడా నిరాశపరిచారు. వరుసగా మూడు వికెట్లు పడడంతో భారత శిబిరంలో ఆందోళన వ్యక్తమయ్యింది. కానీ…స్మృతి మందన ఏ మాత్రం తడబాటు లేకుండా ఆడారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశకు దూసుకెళ్లారు.

ICC Women’s World Cup

Read More : IND-W vs PAK : మహిళల వన్డే ప్రపంచ కప్.. భారత్ బ్యాటింగ్

ఈమెకు తోడుగా హర్మన్ ప్రీత్ కౌర్ జత కలిశారు. ఇంకేముంది వెస్టిండీస్ మహిళా బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ బ్యాట్ ఝులిపించడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. వీరిని విడదీయడానికి వెస్టిండీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. సెంచరీ సాధించి.. జోరు మీదున్న స్మృతి మందన (123, 119 బంతులు, 13 ఫోర్లు, 2 సిక్స్ లు) అవుట్ అయ్యారు. అప్పుడు జట్టు స్కోరు 262. తర్వాత వచ్చిన వారు హర్మన్ కు సహకారం అందించలేకపోయారు. హర్మన్ మాత్రం ఏ మాత్రం తడబడకుండా జాగ్రత్తగా ఆడుతూ.. సెంచరీ సాధించారు. 313 పరుగుల వద్ద హర్మన్ (109, 107 బంతులు, 10 ఫోర్లు, 2 సిక్స్ లు) అవుట్ అయ్యారు. రిచా ఘోష్ (5), పూజా (10), జూలన్ గోస్వామి (2) పరుగులు మాత్రమే చేశారు. స్నేహ్ రానా 2, మేఘానా సింగ్ 1 పరుగుతో నాటౌట్ గా ఉన్నారు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది.

ట్రెండింగ్ వార్తలు