IND-W vs PAK : మహిళల వన్డే ప్రపంచ కప్.. భారత్ బ్యాటింగ్

ఈసారి కప్ కొట్టాలనే ధృడలక్ష్యంతో దిగుతున్న భారత జట్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక పాక్ - భారత బలబలాలను పరిశీలిస్తే.. పాక్ జట్టుపై భారత్ తిరుగులేని రికార్డు నెలకొంది.

IND-W vs PAK : మహిళల వన్డే ప్రపంచ కప్.. భారత్ బ్యాటింగ్

Icc

Mount Maunganui ICC Women’s World Cup 2022 : మహిళల వన్డే ప్రపంచకప్ సమరం స్టార్ట్ అయిపోయింది. దాయాది పాకిస్థాన్ తో భారత్ తలపడుతోంది. తొలి మ్యాచ్ లోనే పాక్ ను ఎదుర్కొనడంతో క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కెప్టెన్ మిథాలీ రాజ్ నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. ఈసారి కప్ కొట్టాలనే ధృడలక్ష్యంతో దిగుతున్న భారత జట్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మౌంట్ మాంగనుయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక పాక్ – భారత బలబలాలను పరిశీలిస్తే.. పాక్ జట్టుపై భారత్ తిరుగులేని రికార్డు నెలకొంది. పది మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ లోనూ భారత్ రెండుసార్లు పాక్ ను ఓడించింది.

Read More : Mithali Raj: మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ 2022

2017లో ప్రపంచకప్ లో తృటిలో కప్పును భారత్ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ మిథాలీతో పాటు పేసర్ జులన్ గోస్వామికి ఇదే చివరి ప్రపంచకప్ కావడం గమనార్హం. కప్పు సాధించి వీడ్కోలు పలకాలని జట్టు పట్టుదలతో ఉంది. స్మృతి, హర్మన్ ఫామ్ లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే.. బౌలింగ్ సమస్య ప్రధానంగా మారింది. పేస్ విభాగం బలహీనంగా ఉండడం ప్రత్యర్థి జట్టుకు కలిసొస్తోంది. బ్యాటింగ్ విభాగం మాత్రం పటిష్టంగానే ఉంది. మంధాన, షెఫాలీ, దీప్తి శర్మ, హర్మన్, మిథాలీ, యాస్తిక, రిచా…బ్యాటింగ్ లో రాణిస్తున్నారు.

Read More : MS Dhoni: టాస్ ఎలా గెలవాలో ఎంఎస్ ధోనీ నుంచి నేర్చుకోవాలి – మిథాలీ రాజ్

భారత జట్టు : స్మృతి మందాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, రిచా గోప్, స్నేహ్ రాణా, జూలన్ గోస్వామి, మేఘన్ సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్.