Women’s World Cup : పాక్ టార్గెట్ 245.. భారత్ మిడిలార్డర్ ఫెయిల్.. రాణించిన మంధన

గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. మ‌హిళ‌ల వన్డే ప్రపంచక‌ప్‌లో భాగంగా..

Women’s World Cup : పాక్ టార్గెట్ 245.. భారత్ మిడిలార్డర్ ఫెయిల్.. రాణించిన మంధన

Team India

IND to 244/7 Against Pakistan : గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. మ‌హిళ‌ల వన్డే ప్రపంచక‌ప్‌లో భాగంగా 2022, మార్చి 06వ తేదీ ఆదివారం పాక్‌తో మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగ‌నూయి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత మహిళల మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొక చేతులేత్తేశారు. పటపటా వికెట్లు పడుతుండడంతో క్రికెట్ క్రీడాభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఓపెనర్ స్మృతి మంధన హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. దీప్తి 40 పరుగులతో రాణించారు. చివరిలో ఏడో బ్యాట్స్ మెన్ గా దిగిన స్నేహ్ రాణా 53 నాటౌట్, పూజా వస్త్రాకర్ (67) బ్యాట్ ఝులిపించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది.

Read More : Mithali Raj: మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ 2022

వార్మప్ మ్యాచ్‌ల్లో ద‌క్షిణాఫ్రికా, విండీస్‌లపై విజయాలు సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్న మిథాలీ సేన.. పాక్‌తో ఇవాళ జ‌రగబోయే మ్యాచ్‌లోనూ పైచేయి సాధించాలని ఆశించింది. కానీ.. పాక్ బౌలర్ల ధాటికి మిడిల్ ఆర్డర్ బెంబేలెత్తిపోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ డకౌట్ గా వెనుదిరిగింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 9 పరుగులు చేసింది నిరాశపరిచింది. హర్మన్ ప్రీత్ కౌర్, రిచా గోప్, జూలన్ గోస్వామి సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత్‌ను ఓడించేందుకు బిస్మా మ‌హ‌రూఫ్ నేతృత్వంలోని పాక్‌ సైతం ఉవ్విళ్లూరుతుంది. పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండటమే కాకుండా మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే విషయం. మహిళల వన్డే క్రికెట్‌లో భారత్‌-పాక్‌లు ఇప్పటి వరకు 10 సందర్భాల్లో ఎదురెదురుపడగా, అన్ని సార్లు టీమిండియానే విజయం వరించింది. ఇందులో 3 విజయాలు ప్రపంచకప్ టోర్నీల్లో దక్కినవే. ఇక పొట్టి క్రికెట్‌లో ఇరు జట్లు తలపడిన 11 మ్యాచ్‌ల్లో టీమిండియా ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్ లో పాక్ పై గెలుస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

Read More : IND-W vs PAK : మహిళల వన్డే ప్రపంచ కప్.. భారత్ బ్యాటింగ్

భారత్ : స్మృతి మంధన 52, షఫాలీ వర్మ 0, దీప్తి శర్మ 40, మిథాలీ రాజ్ 9, హర్మన్ ప్రీత్ కౌర్ 5, రిచా గోప్ 1, స్నేహ్ రాణా 53, పూజా వస్త్రాకర్ 67, జూలన్ గోస్వామి 6 పరుగులు చేశారు.