Womens World Cup 2025 IND W vs SA W Richa Ghosh breaks all time Womens ODI record
Richa Ghosh : భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. గురువారం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 94 పరుగులు సాధించడం ద్వారా ఈ ఘనత అందుకుంది.
అంతేకాదండోయ్ వ్యక్తి గత స్కోరు 53 పరుగుల వద్ద వన్డే క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత వికెట్ కీపర్‌గా రిచా ఘోష్(Richa Ghosh) రికార్డులకు ఎక్కింది.
మహిళల వన్డే క్రికెట్‌లో 8వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే..
* రిచా ఘోష్ (భారత్) – 94 పరుగులు (2025లో దక్షిణాప్రికా పై )
* నదైన్ డిక్లెర్క్ (దక్షిణాఫ్రికా) – 84 నాటౌట్ (2025లో భారత్ పై)
* క్లో ట్రయాన్ (దక్షిణాఫ్రికా) – 74 పరుగులు (2025లో శ్రీలంకపై)
* ఫాతిమా సనా (పాకిస్తాన్) – 69 పరుగులు (దక్షిణాఫ్రికాపై)
Harmanpreet Kaur : గెలిచే మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయామంటే.. హర్మన్ ప్రీత్ కౌర్ కామెంట్స్ వైరల్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు కుప్పకూలింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రిచా ఘోష్ (94; 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ప్రతీకా రావల్ (37), స్నేహ్ రాణా (33)లు రాణించగా.. స్మృతి మంధాన (23) పర్వాలేదనిపించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్లోయ్ ట్రయాన్ మూడు వికెట్లు తీయగా.. మారిజానే కప్ప్, నాడిన్ డి క్లెర్క్, నోంకులులేకో మ్లాబాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఆ తరువాత 252 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాప్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. సఫారీ బ్యాటర్లలో నదైన్ డిక్లెర్క్ (84 నాటౌట్; 54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా.. క్లో ట్రైయాన్ (49; 66 బంతుల్లో 5 ఫోర్లు) రాణించింది. టీమ్ఇండియా బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా లు చెరో రెండు వికెట్లు తీశారు.