Womens World Cup 2025 Tazmin Brits breaks Smriti Mandhana world record
Tazmin Brits : దక్షిణాఫ్రికా బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాజ్మిన్ బ్రిట్స్ (101; 89 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత అందుకుంది.
ఈ క్రమంలో ఆమె టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన రికార్డును బ్రేక్ చేసింది. మంధాన 2024, 2025 క్యాలెండర్ ఇయర్‌లలో నాలుగేసి సెంచరీలు చేసింది. కాగా.. న్యూజిలాండ్‌తో సెంచరీ బ్రిట్స్ కు ఈ ఏడాది 5వది. ఇందులో చివరి ఐదు వన్డేల్లోనే బ్రిట్స్ నాలుగు సెంచరీలు చేయడం గమనార్హం.
* టాజ్మిన్ బ్రిట్స్ (దక్షిణాప్రికా) – 5 సెంచరీలు (2025లో)
* స్మృతి మంధాన (భారత్) – 4 సెంచరీలు (2025లో)
* స్మృతి మంధాన (భారత్) – 4 సెంచరీలు (2024లో)
అత్యంత వేగంగా ఏడు శతకాలు..
తాజా శకంతో టాజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) మరో రికార్డును సొంతం చేసుకుంది. వన్డేల్లో ఆమెకు ఇది ఏడో సెంచరీ. ఈ క్రమంలో మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఏడు శతకాలు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా రికార్డుకు ఎక్కింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ పేరిట ఉండేది. 44 ఇన్నింగ్స్‌ల్లో లాన్నింగ్ ఏడు శతకాలు చేయగా.. టాజ్మిన్ బ్రిట్స్ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించింది.
* టాజ్మిన్ బ్రిట్స్ – 41 ఇన్నింగ్స్‌లు
* మెగ్ లాన్నింగ్ – 44 ఇన్నింగ్స్‌లు
* టామీ బ్యూమాంట్ – 62 ఇన్నింగ్స్‌లు
* సుజీ బేట్స్ – 81 ఇన్నింగ్స్‌లు
* కరెన్ రోల్టన్/హేలే మాథ్యూస్ – 83 ఇన్నింగ్స్‌లు
* స్మృతి మందాన – 84 ఇన్నింగ్స్‌లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్లు 47.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ సోఫీ డివైన్ (85; 98 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసింది. బ్రూక్ హాలిడే (45) రాణించింది. సపారీ బౌలర్లలో నాన్కులులేకో మ్లాబా నాలుగు వికెట్లు తీసింది.
The moment Tazmin Brits made it 4️⃣ hundreds in her last 5️⃣ ODIs 🤩
Watch #NZvSA LIVE in your region, broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29#CWC25 pic.twitter.com/NfSYRjCsOY
— ICC Cricket World Cup (@cricketworldcup) October 6, 2025
ఆ తరువాత టాజ్మిన్ బ్రిట్స్ (101) సెంచరీ బాదగా సునే లూస్ (83 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించడంతో 232 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది.