Aditi Gopichand Swami
World Archery Championships-Aditi : భారత యువ ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి (Aditi Gopichand Swami) అదరగొట్టింది. బెర్లిన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్(World Archery Championships 2023)లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా(17)గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్స్‌లో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెసెర్రా(Andrea Becerra)ను అదితి 149-147తో ఓడించి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.
అంతకముందు అదితి సెమీఫైనల్‌లో తన మార్గదర్శి భారత సీనియర్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ(Jyothi Surekha Vennam)ను ఓడించింది. సెమీఫైనల్‌లో ఓడిన సురేఖ మూడో స్థానానికి జరిగిన పోటీలో విజయం సాధించి కాంస్య పతకాన్ని సాధించింది. ఫైనల్‌లో విజయం సాధించిన తరువాత అదితి మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినట్లు చెప్పింది.
Prithvi Shaw : దరిద్రం నీ వెంటే ఉందా భయ్యా..! విచిత్ర రీతిలో పృథ్వీ షా ఔట్.. వీడియో
ఇక శుక్రవారం జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ కాంపౌండ్ మహిళల జట్టు విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్‌లతో కలిసి అదితి స్వర్ణం నెగ్గింది. మొత్తంగా వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో అదితి రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది.
సూపర్ ఫామ్‌లో అదితి..
మహారాష్ట్రలోని సతారాకు చెందిన అదితి ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గతనెలలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ నెగ్గింది. కాగా.. ఆ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి కాంపౌండ్ ఆర్చర్‌గా నిలిచింది.
Aditi Swami gets the FIRST individual WORLD TITLE for India.
The 17-year-old prodigy is now the world champion. ?#WorldArchery pic.twitter.com/oBbtgxyzq3— World Archery (@worldarchery) August 5, 2023
Rishabh Pant : శుభవార్త.. 140కి.మీ వేగంతో వస్తున్న బంతులను ఎదుర్కొంటున్న పంత్.. త్వరలోనే..