Angelo Mathews Timed Out: నేనేమీ తప్పు చేయలేదు..! నా దగ్గర ఆధారాలున్నాయ్.. టైమ్డ్ ఔట్ పై మాథ్యూస్ వరుస ట్వీట్లు

టైమ్డ్ ఔట్ గా పెవిలియన్ కు చేరిన లంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ మాత్రం దీనిని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాథ్యూస్ బంగ్లా కెప్టెన్ షకీబ్ పై విమర్శలు గుప్పించాడు.

Angelo Mathews Timed Out issue

Angelo Mathews: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ – శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ తరహాలో ఔట్ అయిన మొదటి ప్లేయర్ మాథ్యూస్. అయితే, ఈ ‘టైమ్డ్ ఔట్’ విధానం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్రీడా నిబంధనలకు అనుగుణంగా మేం నడుచుకున్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ స్పష్టం చేశాడు. బంగ్లా జట్టు నిర్ణయంపట్ల విమర్శలు, ప్రశంసలు వస్తున్నాయి.

Also Read : Timed out in cricket : క్రికెట్‌లో టైమ్డ్ ఔట్ అంటే ఏమిటి..? బ్యాట‌ర్‌ను ఇలా ఔట్ చేయొచ్చా..?

టైమ్డ్ ఔట్ గా పెవిలియన్ కు చేరిన లంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ మాత్రం దీనిని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాథ్యూస్ బంగ్లా కెప్టెన్ షకీబ్ పై విమర్శలు గుప్పించాడు. తనకు మైదానంలోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉన్నా ఔట్ ప్రకటించారని, ఇంకా టైమ్ ఉన్నట్లు నా దగ్గర వీడియో ఆధాలు ఉన్నాయని మాథ్యూస్ వ్యాఖ్యానించాడు. ట్విటర్ వేదికగా మాథ్యూస్ టైమ్ తో కూడి ఫొటోలను పోస్టు చేశాడు. ఇందులో బంగ్లా ప్లేయర్ క్యాచ్ పట్టే సమయం, మాథ్యూస్ మైదానంలోకి వచ్చే సమయం ఉన్న ఫొటోలను కలిపి షేర్ చేశాడు. దీనికి .. నిజం ఇది.. క్యాచ్ పట్టిన సమయం, హెల్మెంట్ పట్టీ బయటకు వస్తున్న సమయం నుండి అంటూ ట్వీట్ లో రాశాడు.

Also Read : Timed OUT : గంగూలీ జ‌స్ట్ మిస్‌.. టైమ్డ్ ఔట్ అయిన మొద‌టి క్రికెట‌ర్ అయ్యేవాడే.. 6 నిమిషాల ఆల‌స్యం.. ఎలా త‌ప్పించుకున్నాడో తెలుసా..?

అంతకుముందు ట్వీట్ లో.. ఇక్కడ ఫోర్త్ అంపైర్ తప్పు. హెల్మెంట్ ఇచ్చిన తరువాత కూడా నాకు ఇంకా ఐదు సెకన్ల సమయం ఉంది. వీడియో సాక్ష్యం చూపిస్తుంది. దయచేసి నాల్గో అంపైర్ దీన్ని సరిదిద్దగలరా? నేను హెల్మెంట్ లేకుండా బౌలర్ ను ఎదుర్కోలేను కాబట్టి భద్రత చాలా ముఖ్యమైందని నా ఉద్దేశం అంటూ ట్వీట్లో మాథ్యూస్ పేర్కొన్నాడు.

 

అయితే, ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మాథ్యూస్ క్రీజులోకి వచ్చిన రెండు నిమిషాల్లో తొలి బంతిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాడని అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు