AFG vs AUS : గ్లెన్ మాక్స్‌వెల్ డ‌బుల్ సెంచ‌రీ.. ఆస్ట్రేలియా అనూహ్యా విజ‌యం.. చేజేతులా ఓడిన అఫ్గానిస్థాన్‌

ఏమా ఆట వ‌ర్ణించ‌డానికి మాట‌లు చాల‌వు. 292 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌లో 91 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయిన జ‌ట్టు విజ‌యం సాధిస్తుంద‌ని ఎవ్వ‌రైనా అనుకుంటారా..?

Glenn Maxwell

Australia vs Afghanistan : ఏమా ఆట వ‌ర్ణించ‌డానికి మాట‌లు చాల‌వు. 292 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌లో 91 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయిన జ‌ట్టు విజ‌యం సాధిస్తుంద‌ని ఎవ్వ‌రైనా అనుకుంటారా..? క‌నీసం క‌ల‌లో కూడా దీన్ని ఊహించ‌లేం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్‌మాక్స్‌వెల్. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్స‌ర్లతో 201 అజేయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టుకు అనూహ్య విజ‌యాన్ని అందించాడు.

మాక్స్‌వెల్ విజృంభ‌ణ‌తో 292 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆసీస్‌ 46.5 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. త‌ద్వారా ఆస్ట్రేలియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. మిచెల్ మార్ష్ (24), డేవిడ్ వార్న‌ర్ (18), ల‌బుషేన్ (14) లు విఫ‌లం అయినా..మాక్సీ విభృంభ‌ణ కార‌ణంగా ఆసీస్ గెలుపొందింది. అఫ్గానిస్థాన్ బౌల‌ర్ల‌లో న‌వీన్ ఉల్ హ‌క్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్, ర‌షీద్ ఖాన్ త‌లా రెండు వికెట్లు తీశారు.

LLC 2023 : అభిమానుల‌కు శుభ‌వార్త‌.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టికెట్ల విక్రయాలు ప్రారంభం..

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 5 వికెట్లు న‌ష్ట‌పోయి 291 ప‌రుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (129 నాటౌట్; 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచ‌రీ బాదాడు. చివర్లో రషీద్ ఖాన్ చెలరేగాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. రహ్మత్ షా 30, షాహిదీ 26, అజ్మతుల్లా 22 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ 2 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ ప‌డ‌గొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఇబ్ర‌హీం జ‌ద్రాన్ ఆటే హైలెట్. ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా నిల‌క‌డ‌గా ఆడాడు. ఆసీస్ బౌల‌ర్లకు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా బ్యాటింగ్ చేశాడు. 131 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. త‌ద్వారా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ చ‌రిత్ర‌లో సెంచ‌రీ చేసిన మొద‌టి అఫ్గానిస్థాన్ ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. అంతేకాదు.. ఓవ‌రాల్‌గా ప్ర‌పంచ‌క‌ప్‌లో పిన్న వ‌య‌స్సు(21 ఏళ్ల 330 రోజులు)లో శ‌త‌కం బాదిన నాలుగో బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఆఖ‌ర్లో ర‌షీద్ చెల‌రేగి ఆడ‌డంతో అఫ్గాన్ మెరుగైన స్కోరు సాధించింది.

ODI World Cup 2023 : టైమ్డ్ ఔట్ అంటూ అప్పీల్ చేసిన బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్‌.. వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ష‌కీబ్ ఔట్‌..

ట్రెండింగ్ వార్తలు