AUS vs BAN : బంగ్లాదేశ్‌కు ఆస్ట్రేలియా చెక్‌.. 8 వికెట్ల తేడాతో గెలుపు.. వ‌రుస‌గా ఏడో విజ‌యం

Australia vs Bangladesh : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ఆస్ట్రేలియా అద‌ర‌గొడుతోంది. ఈ టోర్నీ మొద‌టి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ త‌రువాత వ‌రుస విజ‌యాలు సాధించింది.

AUS vs BAN

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ఆస్ట్రేలియా అద‌ర‌గొడుతోంది. ఈ టోర్నీ మొద‌టి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ త‌రువాత వ‌రుస విజ‌యాలు సాధించింది. పూణే వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో ఆసీస్ కు ఇది వ‌రుస‌గా ఏడో విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. 307 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని 45.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయింది ఛేదించింది.

మిచెల్ మార్ష్ (177 నాటౌట్‌; 132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) భారీ శ‌త‌కంతో చెల‌రేగాడు. స్టీవ్ స్మిత్ (63 నాటౌట్‌; 64 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్ వార్న‌ర్ (53; 61 బంతుల్లో 6 ఫోర్లు), లు అర్ధశ‌త‌కాలు బాదారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Ganguly : గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ చూసి.. జ‌డేజా ఏడ్చే ఉంటాడు

Marsh-smith

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. తౌహిద్‌ హృదౌయ్‌ (74; 59 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ‌శ‌త‌కం చేశాడు. నజ్ముల్ హొస్సేన్ శాంటో (45; 57 బంతుల్లో 6 ఫోర్లు) తాంజిద్ హసన్ (36; 34 బంతుల్లో 6 ఫోర్లు), లిట్టన్ దాస్ (36; 45 బంతుల్లో 5 ఫోర్లు), మహ్మదుల్లా (32; 28 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు) లు రాణించారు. మెహదీ హసన్ మిరాజ్ (29), ముష్పీకర్ రహీమ్ (21) లు ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా, సీన్ అబాట్ లు చెరో రెండు వికెట్లు తీశారు. మార్కస్ స్టాయినిస్ ఓ వికెట్ పడగొట్టాడు.

ODI World Cup 2023 : 20 ఏళ్లుగా ప‌దిలంగా ఉన్న సచిన్ 673 రికార్డు.. కోహ్లి, డికాక్, రచిన్ కళ్లు..

కాగా.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లు లీగ్‌లో ఇప్ప‌టికే అన్ని మ్యాచులు ఆడేశాయి. ఏడు మ్యాచుల్లో విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా సెమీస్ చేరుకుంది. సెమీ ఫైన‌ల్‌లో ఆ జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది. మ‌రో వైపు రెండు మ్యాచుల్లో మాత్ర‌మే గెలిచిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్ర్క‌మించింది.

ట్రెండింగ్ వార్తలు