cricket world cup final india austrelia
World Cup Final ..IND vs AUS : ప్రపంచమంతా క్రికెట్ ఫీవర్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా భారత్ లో క్రికెట్ మానియా అంతా ఇంతా కాదు. ఈ వరల్డ్ కప్ కు ఇండియా వేదికగా నిలవటంతో బీసీసీఐ ముగింపు వేడులను భారీగా ప్లాన్ చేసింది. ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం (నవంబర్ 19,2023) క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ చూసేందుకు ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఇక భారత్ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఒళ్లంతా కళ్లతో భారతీయులు ఎదురు చూస్తున్నారు. విశ్వవిజేతగా భారత్ విజయాన్ని ఆశిస్తు..ఆకాంక్షిస్తు యావత్ భారతం కళ్లు గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంపైనే ఉన్నాయి.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన అభిమానుల్ని బీసీసీఐ మంత్రముగ్ధులను చేయనుంది. ఆటే కాదు పాటలతో మైమరపించే ఏర్పాట్లు చేసింది. ఆదివారం భారత్ – ఆసీస్ మధ్య తుది పోరుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆతిథ్య దేశపు హోదాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు చేసింది. లక్షకు పైగా ప్రేక్షకులు హాజరుకాబోయే మోదీ స్టేడియంలో అభిమానులను అలరించబోయే కళాకారుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. ఫైనల్‌లో విరామ సమయంలో జరిగిన ఈవెంట్‌ల ఫ్లో చార్ట్‌ను భారత క్రికెట్ బోర్డు శనివారం వెల్లడించింది.
World Cup Final : వావ్.! చేతి గోరు కంటే బుల్లి బంగారపు క్రికెట్ వరల్డ్ కప్ ..
ఆదివారం మధ్యాహ్నం 2.00 నుంచి అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే మ్యాచ్‌కు ముందే ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. ఫ్లైట్ కమాండర్, డిప్యూటీ టీమ్ లీడర్ వింగ్ కమాండర్ సిదేశ్ కార్తిక్ నేతృత్వంలోని సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ 10 నిమిషాల ఎయిర్ షోతో ఫైనల్ మ్యాచ్ కార్యక్రమాలు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతాయి. మొట్టమొదటి సారిగా నరేంద్ర మోదీ స్టేడియంపై తొమ్మిది హాక్ విన్యాస ప్రదర్శన ఉంటుంది. విమానాలు అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరుతాయి. నరేంద్ర మోదీ స్టేడియంపైన ఎయిర్ షో నిర్వహిస్తాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు టాస్ ముగిసిన తర్వాత 1:35 నుంచి 1:50 గంటల దాకా భారత వైమానిక దళాల ప్రదర్శన ఉంటుంది.
ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ఆదిత్య గాధ్వి మొదటి ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ లో సమయంలో గుజరాత్‌కు చెందిన సింగర్, లిరిసిస్ట్ ఆదిత్య గధ్వి ప్రదర్శన ఉంటుంది. తన గానమాధుర్యంతో ప్రేక్షులను అలరించనున్నారు. తొలి ఇన్నింగ్స్ ముగిశాక బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి, గాయకులు జోనితా గాంధీ, నకాష్ అజీజ్, అమిత్ మిశ్రా, ఆకాస్ సింగ్, తుషార్ జోషీలలు తమ గానాలతో అలరించనున్నారు. ఈ సమయంలో స్టేడియంలో సుమారు 500 మంది నృత్యకారులు కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు.
తొలి ఇన్నింగ్స్ పూర్తయిన తరువాత 15 నిమిషాలుపాటు ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్లను బీసీసీఐ సత్కరిస్తుంది. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ తో పాటు వారి విజయ క్షణాలను 20 సెకన్ల పాటు స్క్రీన్ పై ప్రదర్శన చేయనున్నారు. రెండో ఇన్నింగ్స్ లో డ్రింక్ బ్రేక్ సమయంలో రాత్రి 8.30గంటల సమయానికి 90 సెకన్ల పాటు లేజర్ షో ఉంటుంది. మ్యాచ్ తరువాత విజేత జట్టుకు ప్రపంచ ఛాంఫియన్స్ ట్రోపీని అందిస్తారు. అదేవిధంగా డ్రోన్లు రాత్రిపూట అందమైన ఆకృతులను సృష్టిస్తాయి. అనంతరం బాణాసంచా కాలుస్తారు.
పూర్వీకుల గ్రామంలో MS ధోనీ .. మిస్టర్ కూల్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా
కాగా..అప్రతిహతంగా విజయాలతో దూసుకుపోతున్న భారత్ విశ్వవిజేత కావటానికి ఒక అడుగే ఉంది. భారత్ కు మూడో వన్డే ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుని తీరుతుందనే ధీమా అందరి మనస్సులోను ఉంది. మరోపక్క ఆస్ట్రేలియా కూడా టైటిల్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
It doesn’t get any bigger than this ??
The ICC Men’s Cricket World Cup 2023 Final is filled with stellar performances and an experience of a lifetime ?️?#CWC23 pic.twitter.com/nSoIxDwXek
— BCCI (@BCCI) November 18, 2023