World Cup Final : వావ్.! చేతి గోరు కంటే బుల్లి బంగారపు క్రికెట్ వరల్డ్ కప్ ..

ఏ నోట విన్నా క్రికెట్..క్రికెట్ ..క్రికెట్. ఈ క్రికెట్ మానియా కొనసాగుతున్న తరుణంలో ఓ స్వర్ణకారుడు తయారు చేసిన అత్యంత చిన్న వరల్డ్ కప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

World Cup Final : వావ్.! చేతి గోరు కంటే బుల్లి బంగారపు క్రికెట్ వరల్డ్ కప్ ..

Small Gold Cricket World Cup

World Cup Final : భారతదేశమంతా క్రికెట్ ఫీవర్ కొనసాగుతోంది. అద్దిరిపోయే ప్రతిభతో టీమిండియా వరుసు విజయాలతో విజయ దుంధుబి మోగిస్తోంది. బ్యాటింగ్ లోను..బౌలింగ్ లోను సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.ఏ నోట విన్నా క్రికెట్..క్రికెట్ ..క్రికెట్. ఈ క్రికెట్ మానియాకు వరల్డ్ కప్ ఫైనల్ వేదికకానుంది. క్రికెట్ అంటే అంత్యంత ఇష్టమైన ఓ స్వర్ణకారుడు తయారు చేసిన బంగారపు వరల్డ్ కప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆంధప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన చంద్రశేఖర్ అనే స్వర్ణ కళాకారుడు బంగారంతో అత్యంత చిన్న క్రికెట్ వరల్డ్ కప్ తయారు చేశాడు. చేతి గోరు కంటే చిన్నదైన ఈ బంగారపు క్రికెట్ వరల్డ్ కప్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. చేతి గోరు మీద పెడితే గోరే పెద్దగా కనిపించేంతగా ఉన్న ఇంత చిన్న కప్ పై ‘ఇండియా 2023‘ అని చెక్కటం మరో విశేషం.

ఈ బుల్లి క్రికెట్ కప్ తయారు చేసిన చంద్రశేఖర్ మాట్లాడుతు..ఈ కప్ తయారు చేయటానికి తనకు ఒక రోజు సమయం పట్టిందని కేవలం 3మిల్లీ గ్రాముల బంగారంతో దీన్ని తయారు చేశానని తెలిపారు. అవకాశం వస్తే ఈ బుల్లి బంగారు క్రికెట్ వరల్డ్ కప్ ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రీడాభిమానుల్ని సంపాదించుకున్న ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బహుమతిగా ఇవ్వాలని ఉంది అంటూ తన ఆకాంక్షను వ్యక్తంచేశారు స్వర్ణకళాకారుడు చంద్రశేఖర్. కానీ తనకు అటువంటి అవకాశం లభిస్తుందా..? వస్తే వెరీ హ్యాపీ అంటూ తన మనస్సులోని కోరికను వెల్లడించారు.