Reece Topley Ruled Out Of World Cup
ODI World Cup : డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్‌లో అడుగుపెట్టింది ఇంగ్లాండ్. వచ్చిన దగ్గర నుంచి ఆ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. టైటిల్ ఫేవరేట్ అనుకున్న ఆ జట్టు అనూహ్యంగా చతికిల పడుతోంది. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆ జట్టు నాలుగు మ్యాచులు ఆడగా ఒక్కటంటే ఒక్క మ్యాచులోనే విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై మాత్రమే విజయం సాధించిన ఇంగ్లాండ్.. అఫ్గానిస్థాన్ చేతిలో కూడా ఓటమిపాలైంది. ప్రస్తుతం 2 పాయింట్లతో పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానం(తొమ్మిదో) స్థానంలో కొనసాగుతోంది.
స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఆ జట్టు సెమీస్ చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ చేరుతుంది. అయితే.. అది అంత ఈజీ కాదు.. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఇంగ్లాండ్ ఎదుర్కోవాల్సి ఉంది. వీటిని ఓడిస్తేనే ఇంగ్లాండ్‌కు సెమీస్‌కు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. ఇలా అసలే కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ మరో షాక్ తగిలింది.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు.. 52 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు..
స్టార్ బౌలర్ ఔట్..
గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ రీస్ టాప్లీ వన్డే ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచులకు దూరం అయ్యాడు. శనివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచులో అతడి చూపుడు వేలుకి గాయమైంది. వెంటనే అతడు మైదానాన్ని వదిలి వెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. గాయం వేధిస్తున్నప్పటికీ ఆరు ఓవర్లు బౌలింగ్ చేశాడు. మొత్తంగా ఆ మ్యాచులో 8.5 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 229 పరుగుల తేడాతో ఓడిపోయింది.
News we didn’t want to bring you ☹
Reece Topley has been ruled out of the rest of the #CWC23
We’re all with you, Toppers ❤️
— England Cricket (@englandcricket) October 22, 2023
మ్యాచ్ అనంతరం అతడి గాయం తీవ్రతను తెలుసుకునేందుకు స్కానింగ్‌కు పంపారు. చూపుడు వేలుకి ప్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో అతడు ప్రపంచకప్ నుంచి తప్పుకున్నట్లు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకనటలో తెలిపింది. అయితే.. అతడి స్థానంలో ఇప్పటి వరకు ఎవరిని భర్తీ చేయలేదు ఈసీబీ. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన టాప్లీ 2.87 సగటుతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 4/43. మంచి ఫామ్‌లో ఉన్న టాప్లీ దూరం అవ్వడం నిజంగా ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.