Rohit Sharma : రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్న రోహిత్ శ‌ర్మ‌.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రెండో ఆట‌గాడు

విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ల‌లో భార‌త కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఒక‌డు. వ‌న్డేల్లో మూడు సార్లు ద్విశ‌త‌కం బాదిన ఏక‌క ఆట‌గాడు.

Rohit Sharma : రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్న రోహిత్ శ‌ర్మ‌.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రెండో ఆట‌గాడు

Rohit Sharma Pic@BCCI twitter

Updated On : October 22, 2023 / 7:32 PM IST

Rohit Sharma records : విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ల‌లో భార‌త కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఒక‌డు. వ‌న్డేల్లో మూడు సార్లు ద్విశ‌త‌కం బాదిన ఏక‌క ఆట‌గాడు. తాజాగా హిట్‌మ్యాన్.. మిస్ట‌ర్ 360 డిగ్రీస్ ఆట‌గాడు డివిలియ‌ర్స్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. ఈ క్ర‌మంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో డివిలియ‌ర్స్ 37 సిక్సులు కొట్ట‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రెండు సిక్స‌ర్లు కొట్ట‌డం ద్వారా రోహిత్ శ‌ర్మ 38 సిక్సుల‌తో డివిలియ‌ర్స్ రికార్డును అధిగ‌మించాడు. ఈ జాబితాలో 49 సిక్సుల‌తో క్రిస్ గేల్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. రోహిత్ గ‌నుక ఇదే ఊపును కొన‌సాగిస్తే గేల్ రికార్డు కూడా ఈ మెగాటోర్నీలోనే బ‌ద్దలు కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆట‌గాళ్లు..

క్రిస్ గేల్ (వెస్టిండీస్‌) – 49 సిక్స‌ర్లు
రోహిత్ శర్మ (భార‌త్‌) – 38* సిక్స‌ర్లు
ఏబీ డివిలియర్స్ (ద‌క్షిణాఫ్రికా) – 37 సిక్స‌ర్లు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 31 సిక్స‌ర్లు
బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్‌) – 29 సిక్స‌ర్లు

Mohammed Shami : చ‌రిత్ర సృష్టించిన ష‌మీ.. ఒకే ఒక్క భార‌తీయుడు.. ద‌రిదాపుల్లో ఎవ‌రూ లేరు

ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో 50 సిక్సులు..

వ‌న్డేల్లో రోహిత్ శ‌ర్మ మ‌రో ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో వ‌న్డేల్లో 50 సిక్సులు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ ఘ‌న‌త సాధించిన ఒకే ఒక్క భార‌త ఆట‌గాడు అతడే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ జాబితాలో 58 సిక్స‌ర్ల‌తో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్ (2015లో) అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత 56 సిక్సుల‌తో వెస్టిండీస్ ఆట‌గాడు క్రిస్‌గేల్ (2019) రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్ద‌రి త‌రువాత రోహిత్ శ‌ర్మ (2023లో) 50* మూడో స్థానంలో నిలిచాడు.

ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన ఆట‌గాళ్ల జాబితా..

ఏబీ డివిలియ‌ర్స్ (ద‌క్షిణాఫ్రికా) -2015లో 58 సిక్స‌ర్లు
క్రిస్ గేల్ (వెస్టిండీస్‌) – 2019లో 56 సిక్స‌ర్లు
రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 2023లో 50*సిక్స‌ర్లు


Sehar Shinwari : భార‌త్ పై పాకిస్థాన్‌ న‌టి అక్క‌సు.. టీమ్ఇండియాని ఓడిస్తే మ‌ట‌న్ బిర్యానీ..