Hardik Pandya : టీమిండియాకు షాక్‌.. బౌలింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ హార్దిక్ పాండ్య‌.. మళ్లీ బౌలింగ్ చేయ‌డం క‌ష్ట‌మే..?

బౌలింగ్ చేస్తున్న భార‌త జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్య గాయ‌ప‌డ్డాడు.

Hardik Pandya injury

Hardik Pandya injury : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా పూణె వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. బౌలింగ్ చేస్తున్న భార‌త జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్య గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌డు మైదానాన్ని వీడాడు. అత‌డి గాయం తీవ్ర‌త పై ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త లేదు గానీ చూస్తుంటే ఈ మ్యాచ్‌లో అత‌డు బౌలింగ్ చేయ‌డం దాదాపు క‌ష్ట‌మే. ఒక‌వేళ గాయం తీవ్ర‌త గ‌నుక ఎక్కువ‌గా ఉంటే అత‌డు ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగిలిన మ్యాచుల‌కు దూరం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అదే జ‌రిగితే భార‌త్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గా చెప్ప‌వ‌చ్చు.

ఏం జ‌రిగిందంటే..?

ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవ‌ర్‌ను హార్దిక్ పాండ్య వేశాడు. ఈ మ్యాచ్‌లో అత‌డికి అదే మొద‌టి ఓవ‌ర్‌. తొలి రెండు బంతుల‌కు లిట‌న్ దాస్ బౌండ‌రీలు కొట్టాడు. మూడో బంతిని కాస్త స్ట్రైట్ గా ఆడగా.. ఆపేందుకు బౌలింగ్ ఫాలో త్రూలోనే హార్దిక్ పాండ్య ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో అత‌డి ఎడ‌మ కాలు మ‌డ‌త ప‌డింది. దీంతో పాండ్య విల‌విల‌లాడాడు. వెంట‌నే ఫిజియో వ‌చ్చి అత‌డి కాలుకి బ్యాండేజ్ వేశాడు. పాండ్య స‌రిగ్గా నిలబ‌డ‌క‌లేక‌పోయాడు. దీంతో అత‌డు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ ఓవ‌ర్‌లో మిగిలిన మూడు బంతుల‌ను కోహ్లీ పూర్తి చేశాడు. మూడు బంతుల్లో కోహ్లీ రెండు ప‌రుగులు ఇచ్చాడు.

Also Read: హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అజహరుద్దీన్ పై కేసు నమోదు.. ఎందుకంటే?

Hardik Pandya injury

కాగా.. పాండ్య గాయం తీవ్ర‌త‌పై బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్య గాయాన్ని అంచ‌నా వేసేందుకు అత‌డిని స్కానింగ్ కోసం తీసుకువెలుతున్నారు అంటూ ట్వీట్ చేసింది.

Also Read: వన్డే ర్యాంకుల్లో దుమ్ము రేపిన రోహిత్ శర్మ

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి వికెట్ కోల్పోకుండా 63 ప‌రుగులు చేసింది. లిట‌న్ దాస్ (21), తాంజిద్ హసన్ (40) లు ఆడుతున్నారు.