ICC ODI Rankings: వన్డే ర్యాంకుల్లో దుమ్ము రేపిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకుల్లో దూసుకుపోయాడు.

ICC ODI Rankings: వన్డే ర్యాంకుల్లో దుమ్ము రేపిన రోహిత్ శర్మ

icc odi rankings Rohit Sharma rises five places to sixth

Updated On : October 19, 2023 / 1:32 PM IST

Rohit Sharma: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్ము రేపాడు. వన్డే వరల్డ్ కప్ తో తొలి మూడు మ్యాచ్ ల్లో సత్తా చాటిన రోహిత్ మరోసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్ లో నిలిచాడు. గతవారం టాప్ 10 నుంచి పడిపోయిన హిట్ మ్యాన్ మళ్లీ పుంజుకుని తన ర్యాంక్ ను మెరుగుపరుచుకున్నాడు. అఫ్గానిస్థాన్ తో జరిగి మ్యాచ్ లో సెంచరీ(131)తో పాటు పాకిస్థాన్ తో జరిగి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ (86)తో అదరగొట్టాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఫస్ట్ ర్యాంక్ లో కంటిన్యూ అవుతున్నాడు. టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మ‌న్ గిల్ రెండో ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ మూడు స్థానాలు ఎగసి 3వ ర్యాంక్ లో నిలిచాడు. విరాట్ కోహ్లి 9, కేఎల్ రాహుల్ 19 ర్యాంకుల్లో ఉన్నారు. అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 49 స్థానాలు జంప్ చేసి 18వ ర్యాంక్ దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 16 స్థానాలు ఎగసి 27వ ర్యాంక్ లోకి వచ్చాడు.

మహ్మద్ సిరాజ్ కు 3వ ర్యాంక్
బౌలింగ్ ర్యాంకులకు వస్తే ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ టాప్ లో కొనసాగుతున్నాడు. టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ 3వ ర్యాంక్ కు పడిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 8వ ర్యాంక్ లో కంటిన్యూ అవుతున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.. నాలుగైదు ర్యాంకుల్లో ఉన్నారు.

Also Read: రసవత్తరంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు.. గెలిచేదెవరో?

బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆల్ రౌండర్ల విభాగంలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మహ్మద్ నబీ (అఫ్గానిస్థాన్), సికిందర్ రజా(జింబాబ్వే) 2, 3 ర్యాంకుల్లో ఉన్నారు. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 9వ ర్యాంక్ లో నిలిచాడు.

ICC ODI Rankings

ICC ODI Rankings