Team India
World Cup 2023 IND vs BAN : వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది. పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (103 నాటౌట్; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) శతక్కొట్టాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 48వ సెంచరీ. శుభ్‌మన్ గిల్ (53; 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (48; 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల) రెండు పరుగుల తేడాతో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (19) విఫలమైనా కేఎల్ రాహుల్ (34 నాటౌట్) రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ రెండు వికెట్లు తీశాడు. హసన్ మహమూద్ ఓ వికెట్ పడగొట్టారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో లిట్టన్ దాస్ (66; 82 బంతుల్లో 7 ఫోర్లు), తాంజిద్ హసన్ (51; 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. మహ్మదుల్లా 46, ముష్ఫికర్ రహీమ్ 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు. శార్దూల్ థాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
Virat Kohli slams his 48th ODI ton in an emphatic India win in Pune ?@mastercardindia Milestones ?#CWC23 | #INDvBAN pic.twitter.com/3WoTTGy0f8
— ICC Cricket World Cup (@cricketworldcup) October 19, 2023