ODI World Cup 2023: ఆ ఒక్క క్యాచ్ వదిలేసి.. భారత్ విజయానికి బాటలు వేసిన ఆసీస్.. వీడియో వైరల్

ఆస్ట్రేలియా బౌలర్లు పదునైన బంతులతో క్రీజులోఉన్న రాహుల్, కోహ్లీ ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్స్ అంతా స్టేడియంలో, టీవీల ముందు ఊపిరిబిగపట్టుకొని మ్యాచ్ చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో.. విరాట్ కోహ్లీ ఓ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ బంతి అక్కడే గాల్లోకి లేచింది.

India vs Australia Match World Cup 2023

India vs Australia Match World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఆదివారం సాయంత్రం చెన్నైలోని చపాక్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఇరుజట్ల మధ్య నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో చివరికి భారత్ జట్లు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మెగాటోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలిమ్యాచ్. అయితే, ఆస్ట్రేలియా ఫీల్డింగ్ సమయంలో ఆ జట్టు ప్లేయర్ చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా భారత్ విజయానికి ఆస్ట్రేలియా రెడ్ కార్పెట్ పర్చినట్లయింది.

Read Also : Election Commission: తెలంగాణలోసహా ఐదు రాష్ట్రాలకు మోగనున్న ఎన్నికల సైరన్.. మరికొద్ది గంటల్లో తేదీలు ప్రకటించనున్న సీఈసీ

ఆస్ట్రేలియా ప్లేయర్ వదిలేసిన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఒక్క క్యాచ్ పట్టుంటే భారత్ పరిస్థితి వేరేలా ఉండేది. 200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే వరుస షాక్ లు తగిలాయి. రోహిత్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ వరుసగా డౌకౌట్లు అయ్యారు. భారత్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ తరువాత కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ జట్టు గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో ఒక్క వికెట్ పడినా భారత్ ఓటమి అంచుకుచేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read Also : World Cup 2023 IND vs AUS ODI : అర్థ‌శ‌త‌కాల‌తో రాణించిన‌ కోహ్లీ, రాహుల్‌.. ఆస్ట్రేలియా పై టీమ్ ఇండియా విజ‌యం

ఆస్ట్రేలియా బౌలర్లు పదునైన బంతులతో క్రీజులోఉన్న రాహుల్, కోహ్లీ ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్స్ అంతా స్టేడియంలో, టీవీల ముందు ఊపిరిబిగపట్టుకొని మ్యాచ్ చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో.. విరాట్ కోహ్లీ ఓ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ బంతి అక్కడే గాల్లోకి లేచింది. భారత్ అభిమానుల గుండెలు ఒక్కసారిగా ఆగినంతపనైంది. మిచెల్ మార్ష్ షార్ట్ మిడ్ వికెట్ నుంచి ముందుకు పరుగుతీసి క్యాచ్ పట్టుకొనే ప్రయత్నం చేశాడు.. కానీ, బంతిని సరిగా అంచనావేయక క్యాచ్ మిస్ చేశాడు. దీంతో భారత్ అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ తరువాత కోహ్లీ, రాహుల్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. చివరికి భారత్ విజయంలో కీలక భూమిక పోషించారు. మిచెల్ మార్ష్ కోహ్లీ క్యాచ్ పట్టుంటే భారత్ జట్టు దాదాపు ఓటమి అంచుల్లోకి చేరే అవకాశాలే ఎక్కువగా ఉండేవి.

 

ట్రెండింగ్ వార్తలు