World Cup 2023 NZ vs NED ODI
నెదర్లాండ్స్ ఓటమి
ఉప్పల్‌లో కివీస్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై విజయాన్ని సాధించింది. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలైటైంది.
40 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోరు 198/7
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లు పూర్తి అయ్యాయి. ఏడు వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. ర్యాన్ క్లైన్ (7), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (19)లు ఆడుతున్నారు.
కోలిన్ అకెర్మాన్ ఔట్..
మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో మాట్ హెన్రీ క్యాచ్ అందుకోవడంతో కోలిన్ అకెర్మాన్ (69; 73 బంతుల్లో 5ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 32.5వ ఓవర్‌లో 157 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఐదో వికెట్ కోల్పోయింది.
అకెర్మాన్ అర్థశతకం
మాట్ హెన్రీ బౌలింగ్‌లో (27.2వ ఓవర్)లో ఫోర్ కొట్టి 55 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. కాగా.. వన్డేల్లో అతడికి ఇది మూడో హాఫ్ సెంచరీ. 28 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోరు 131/4. కోలిన్ అకెర్మాన్ (54), స్కాట్ ఎడ్వర్డ్స్ (7) లు క్రీజులో ఉన్నారు.
20 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోరు 80/3
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు పూర్తి అయ్యాయి. మూడు వికెట్లు నష్టపోయి 80 పరుగులు చేసింది. తేజా నిడమనూరు (7), కోలిన్ అకెర్మాన్ (27)లు ఆడుతున్నారు.
10 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోరు 35/1
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు పూర్తి అయ్యాయి. వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. మాక్స్ ఓడౌడ్ (11), కోలిన్ అకెర్మాన్ (12)లు ఆడుతున్నారు.
5 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోరు 17/0
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు నెదర్లాండ్స్ జట్టు బరిలోకి దిగింది. 5 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోరు 17/0. విక్రమ్‌జిత్ సింగ్ (9), మాక్స్ ఓడౌడ్ (8) లు ఆడుతున్నారు.
నెదర్లాండ్స్ టార్గెట్ 323
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్ (70; 80 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్ లాథమ్( 53; 46 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్) , రచిన్ రవీంద్ర ( 51; 51 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. డారిల్ మిచెల్ (48; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవాన్ కాన్వే (32) లు రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే లు తలా రెండు వికెట్లు తీయగా బాస్ డి లీడే ఓ వికెట్ పడగొట్టాడు.
డారిల్ మిచెల్ క్లీన్‌బౌల్డ్..
పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ (48; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కివీస్ 40.1వ ఓవర్‌లో 238 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
రచిన్ రవీంద్ర ఔట్..
రోలోఫ్ వాన్ డెర్ మెర్వే బౌలింగ్‌లో (32.1వ ఓవర్)లో రెండు పరుగులు తీసిన రచిన్ రవీంద్ర 50 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే స్కాట్ ఎడ్వర్డ్స్ క్యాచ్ అందుకోవడంతో రచిన్ ( 51; 51 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) ఔట్ అయ్యాడు. 33 ఓవర్లకు కివీస్ స్కోరు 187/3. డారిల్ మిచెల్ (23), టామ్ లాథమ్ (1)లు ఆడుతున్నారు.
30 ఓవర్లకు కివీస్ స్కోరు 171/2
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లు ముగిశాయి. రెండు నష్టానికి కివీస్ 171 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (40), డారిల్ మిచెల్ (19) లు ఆడుతున్నారు.
విల్ యంగ్ ఔట్..
కివీస్ మరో వికెట్ కోల్పోయింది. రోలోఫ్ వాన్ డెర్ మెర్వే బౌలింగ్‌లో విల్ యంగ్ (70; 80 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు) బాస్ డి లీడే క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో కివీస్ 26.1వ ఓవర్‌లో 144 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
25 ఓవర్లకు కివీస్ స్కోరు 135/1
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు ముగిశాయి. వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. విల్ యంగ్ (66), రచిన్ రవీంద్ర (31)లు ఆడుతున్నారు.
విల్‌యంగ్ హాఫ్ సెంచరీ
ఆర్యన్ దత్ బౌలింగ్‌లో (19.6వ ఓవర్) సింగిల్ తీసి విల్ యంగ్ 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థశతకాన్ని పూర్తి చేశాడు. 20 ఓవర్లకు కివీస్ స్కోరు 102/1. విల్ యంగ్ (50), రచిన్ రవీంద్ర (14)లు ఆడుతున్నారు.
15 ఓవర్లకు కివీస్ స్కోరు 81/1.
కివీస్ ఇన్నింగ్స్‌లో మొదటి 15 ఓవర్లు ముగిశాయి. వికెట్ నష్టానికి కివీస్ 81 పరుగులు చేసింది. విల్ యంగ్ (40), రచిన్ రవీంద్ర (4)లు ఆడుతున్నారు.
కాన్వే ఔట్..
రోలోఫ్ వాన్ డెర్ మెర్వే బౌలింగ్‌లో బాస్ డి లీడే క్యాచ్ అందుకోవడంతో డేవాన్ కాన్వే (32; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఔట్ అయ్యాడు. దీంతో 12.1వ ఓవర్‌లో 67 పరుగుల వద్ద కివీస్ మొదటి వికెట్ కోల్పోయింది.
10 ఓవర్లకు కివీస్ స్కోరు 63/0
కివీస్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 10 ఓవర్లలో కివీస్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. విల్ యంగ్ (29), డేవాన్ కాన్వే (29) లు ఆడుతున్నారు.
5 ఓవర్లకు కివీస్ స్కోరు 19/0
న్యూజిలాండ్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. కివీస్ ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు పూర్తి అయ్యాయి. వికెట్ నష్టపోకుండా కివీస్ 19 పరుగులు చేసింది. విల్ యంగ్ (18), డేవాన్ కాన్వే (1) లు ఆడుతున్నారు.
న్యూజిలాండ్ తుది జట్టు : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
నెదర్లాండ్స్ తుది జట్టు : విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్
Captain Edwards decides to field first after winning the toss.
Sybrand Engelbrecht debuts while Ryan Klein replaces an injured LVB in our XI against the Kiwis today. #CWC23 pic.twitter.com/w8kHP3uHV0
— Cricket?Netherlands (@KNCBcricket) October 9, 2023
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా నెదర్లాండ్స్ జట్టుతో న్యూజిలాండ్ తలపడుతోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ కూడా రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ దూరం అయ్యాడు. టామ్ లాథమ్ కివీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.