World Cup 2023 PAK vs SL ODI
పాకిస్తాన్ విజయం
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 345 పరుగుల లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మహ్మద్ రిజ్వాన్ సెంచరీ
పతిరణ బౌలింగ్‌లో(41.1వ ఓవర్‌లో) సింగిల్ తీసి 97 బంతుల్లో మహ్మద్ రిజ్వాన్ సెంచరీ చేశాడు.
అబ్దుల్లా షఫీక్ ఔట్
పతిరణ బౌలింగ్‌లో హేమంత క్యాచ్ అందుకోవడంతో అబ్దుల్లా షఫీక్ (113; 103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 33.1వ ఓవర్‌లో 213 పరుగుల వద్ద పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది.
అబ్దుల్లా షఫీక్ సెంచరీ
మధుశంక బౌలింగ్‌లో (31.2వ ఓవర్)లో ఫోర్ కొట్టి అబ్దుల్లా షఫీక్ 97 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా.. వన్డేల్లో ఇది అతడికి తొలి శతకం.
రిజ్వాన్ హాఫ్ సెంచరీ
పతిరణ బౌలింగ్‌లో (28.1వ ఓవర్) ఫోర్ కొట్టి 58 బంతుల్లో రిజ్వాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
25 ఓవర్లకు పాకిస్తాన్ స్కోరు 138/2
పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు ముగిశాయి. రెండు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 138 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (68), మహ్మద్ రిజ్వాన్ (39) లు ఆడుతున్నారు.
అబ్దుల్లా షఫీక్ హాఫ్ సెంచరీ
ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో (18.6వ ఓవర్) సింగిల్ తీసి అబ్దుల్లా షఫీక్ 58 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 20 ఓవర్లకు పాకిస్తాన్ స్కోరు 110 2. అబ్దుల్లా షఫీక్ (51), మహ్మద్ రిజ్వాన్ (28) లు ఆడుతున్నారు.
10 ఓవర్లకు పాకిస్తాన్ స్కోరు 48/2
పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు పూర్తి అయ్యాయి. రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 48 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (22), మహ్మద్ రిజ్వాన్ (3) లు ఆడుతున్నారు.
బాబర్ ఔట్..
పాకిస్తాన్ మరో వికెట్ కోల్పోయింది. బాబర్ ఆజం (10) మధుశంక బౌలింగ్‌లో సదీర సమరవిక్రమ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 7.2 వ ఓవర్‌లో 37 పరుగుల వద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది.
ఇమామ్ ఉల్ హక్ ఔట్
భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. ఇమామ్ ఉల్ హక్ ఔట్ (12) మధుశంక బౌలింగ్‌లో కుశాల్ పెరీరా క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ 3.3 ఓవర్‌లో 16 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
పాకిస్తాన్ టార్గెట్ 345
శ్రీలంక ఆటగాళ్లు కుశాల్ మెండీస్, సదీర సమరవిక్రమ లు ఉప్పల్‌లో శతకాలతో చెలరేగారు. దీంతో పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్ (122; 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లు), సదీర సమరవిక్రమ (108; 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు బాదారు. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (51; 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్తాన్ బౌల్లరలో హసన్ అలీ నాలుగు వికెట్లు తీయగా, హరీస్ రవూఫ్ రెండు, షహీన్ అఫ్రీదీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్,లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
సదీర సమరవిక్రమ సెంచరీ
హసన్ అలీ బౌలింగ్‌లో(45.5) సింగిల్ తీసి సదీర సమరవిక్రమ 82 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ చేశాడు.
సదీర సమరవిక్రమ హాఫ్ సెంచరీ..
షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో (33.1వ ఓవర్)లో సింగిల్ తీసి 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 35 ఓవర్లకు శ్రీలంక స్కోరు 247/4. సదీర సమరవిక్రమ (54), ధనంజయ డిసిల్వా(9) లు ఆడుతున్నారు.
కుశాల్ మెండీస్ ఔట్..
హసన్ అలీ బౌలింగ్‌లో ఇమామ్ క్యాచ్ అందుకోవడంతో కుశాల్ మెండీస్ (122; 77 బంతుల్లో 14 ఫోర్లు, 6సిక్స్‌లు) ఔట్ అయ్యాడు. దీంతో శ్రీలంక 28.5వ ఓవర్‌లో 218 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
సిక్స్‌తో కుశాల్ మెండీస్ సెంచరీ
హసన్ అలీ బౌలింగ్‌లో (26.1వ ఓవర్) సిక్స్ కొట్టిన కుశాల్ మెండీస్ 65 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంక తరుపున అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు.
25 ఓవర్లకు శ్రీలంక స్కోరు 181/2
శ్రీలంక ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు పూర్తి అయ్యాయి. 25 ఓవర్లకు శ్రీలంక స్కోరు 181/2. కుశాల్ మెండిస్(92), సదీర సమరవిక్రమ (30) లు ఆడుతున్నారు.
20 ఓవర్లకు శ్రీలంక స్కోరు 147/2
శ్రీలంక ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు పూర్తి అయ్యాయి. రెండు వికెట్ల నష్టానికి లంక 147 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(66), సదీర సమరవిక్రమ (23) లు ఆడుతున్నారు.
నిస్సాంక ఔట్
షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో షఫీక్ క్యాచ్ అందుకోవడంతో (51; 61 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్) ఔట్ అయ్యాడు. దీంతో 17.2వ ఓవర్‌లో 107 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
కుశాల్ మెండీస్ హాఫ్ సెంచరీ..
నవాజ్ బౌలింగ్‌లో (16.6వ ఓవర్) ఫోర్ కొట్టి 40 బంతుల్లో కుశాల్ మెండీస్ హాఫ్ సెంచరీ చేశాడు.
పాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీ
నవాజ్ బౌలింగ్‌లో(16.4వ ఓవర్) సింగిల్ తీసి 58 బంతుల్లో పాతుమ్ నిస్సాంక అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
15 ఓవర్లకు శ్రీలంక స్కోరు 90/1
శ్రీలంక ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు పూర్తి అయ్యాయి. వికెట్ నష్టపోయిన లంక 90 పరగులు చేసింది. పాతుమ్ నిస్సాంక (47), కుశాల్ మెండిస్(37)లు ఆడుతున్నారు.
10 ఓవర్లకు శ్రీలంక స్కోరు 58/1
ఆరంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికీ శ్రీలంక బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు శ్రీలంక స్కోరు 58/1. పాతుమ్ నిస్సాంక (29), కుశాల్ మెండిస్(23)లు ఆడుతున్నారు.
5 ఓవర్లకు శ్రీలంక స్కోరు 34/1
లంక ఇన్నింగ్స్‌లో మొదటి 5 ఓవర్లు ముగిశాయి. వికెట్ నష్టానికి శ్రీలంక 31 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక (10), కుశాల్ మెండిస్(18)లు ఆడుతున్నారు.
కుశాల్ పెరీరా డకౌట్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు రెండో ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. హసన్ అలీ బౌలింగ్‌లో రిజ్వాన్ క్యాచ్ అందుకోవడంతో కుశాల్ పెరీరా డకౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక 1.4వ ఓవర్‌లో 5 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్లకు శ్రీలంక స్కోరు 6/1. పాతుమ్ నిస్సాంక (4), కుశాల్ మెండిస్(0) లు క్రీజులో ఉన్నారు.
శ్రీలంక తుది జట్టు : పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక
పాకిస్థాన్ తుది జట్టు : అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్
World Cup 2023 PAK vs SL ODI : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు ప్రపంచకప్‌లో ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచకప్‌లో బోణీ కొట్టాలని భావిస్తుండగా.. విజయపరంపరను కంటిన్యూ చేయాలని పాకిస్తాన్ ఆరాటపడుతోంది.
Dasun Shanaka won the toss and elected to bat first.#SLvPAK #LankanLions #CWC23 pic.twitter.com/f7GHD6iCK6
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) October 10, 2023