ODI World Cup 2023 : పాకిస్థాన్‌కు వ‌ర్షం సాయం చేస్తే.. ఐసీసీ షాకిచ్చింది

ఈ గెలుపు ఇచ్చిన జోష్ లో ఉన్న పాకిస్థాన్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది.

Pakistan fined for slow over rate

ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజ‌యం సాధించింది. శ‌నివారం బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 21 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో త‌న సెమీస్ అవ‌కాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపు ఇచ్చిన జోష్ లో ఉన్న పాకిస్థాన్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది.

స్లో ఓవ‌ర్ రేటు కార‌ణంగా పాకిస్థాన్ జ‌ట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్దేశిత స‌మ‌యంలో త‌న ఓవ‌ర్ల కోటాను పూర్తి చేయ‌లేదు. ఆ స‌మ‌యానికి రెండు ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేసింది. ICC ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది. ఈ లెక్క‌న రెండు ఓవ‌ర్ల‌కు 10 శాతం జ‌రిమానాగా మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ విధించారు. త‌మ త‌ప్పిదాన్ని పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం అంగీక‌రించాడు.

Virat Kohli : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో కోహ్లీలా.. బ‌ర్త్ డే రోజునే సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీళ్లే..

డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు న‌ష్ట‌పోయి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108; 94 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్) సెంచ‌రీ చేశాడు. కేన్ విలియమ్సన్ (95; 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ వాసిం జూనియర్ మూడు, హసన్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్ త‌లా ఓ వికెట్ ప‌డగొట్టారు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్థాన్ 25.3 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టపోయి 200 ప‌రుగులు చేసింది. ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (126; నాటౌట్ 81 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్స‌ర్లు) మెరుపు శ‌త‌కం, బాబ‌ర్ ఆజాం (63 నాటౌట్; 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాప్ సెంచ‌రీ చేశాడు. ఈ స‌మ‌యంలో వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ నిలిచిపోయింది. మ‌ళ్లీ మ్యాచ్‌ను నిర్వ‌హించేందుకు సాధ్యం కాక‌పోవ‌డంతో మ్యాచ్ నిలిచిపోయే స‌మ‌యానికి 21 ప‌రుగులు ముందంజ‌లో ఉన్న పాకిస్థాన్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.

NZ vs PAK : ఒక్క సెంచ‌రీతో హీరో.. రివార్డు ప్ర‌క‌టించిన పీసీబీ.. ఎంతో తెలుసా..?

ట్రెండింగ్ వార్తలు