Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. స‌చిన్ శ‌త‌కాల రికార్డు బ్రేక్‌

Kohli break Sachin ODI century Record : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు.

Kohli break Sachin ODI century Record

Kohli break Sachin ODI century Record : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ఈ క్ర‌మంలో స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేశాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా బుధ‌వారం ముంబైలోని ఈడెన్ గార్డెన్స్‌లో న్యూజిలాండ్‌తో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో సెంచ‌రీ చేయ‌డం ద్వారా కోహ్లీ ఈ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. వ‌న్డేల్లో కోహ్లీకి ఇది 50 వ శ‌త‌కం కావ‌డం విశేషం.

వ‌న్డేల్లో స‌చిన్ 49 శ‌త‌కాలు చేయ‌డానికి 452 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం కాగా.. విరాట్ కోహ్లీ కేవ‌లం 279 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితా..

విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 50 శ‌త‌కాలు (279 ఇన్నింగ్స్‌లు)
సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) – 49 శ‌త‌కాలు (452 ఇన్నింగ్స్‌లు)
రోహిత్ శర్మ(భార‌త్‌) – 31శ‌త‌కాలు (253 ఇన్నింగ్స్‌లు)
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 30 (365 ఇన్నింగ్స్‌లు)
సనత్ జయసూర్య (శ్రీలంక‌)- 28 శ‌త‌కాలు (433 ఇన్నింగ్స్‌లు)

Rohit Sharma : క్రిస్‌గేల్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

రికీ పాంటింగ్ రికార్డు బ్రేక్‌..

వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలోకి దూసుకువ‌చ్చాడు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా ఆట‌గాడు రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. రికీ పాంటింగ్ 375 వ‌న్డే మ్యాచుల్లో 365 ఇన్నింగ్స్‌ల్లో 13704 ప‌రుగులు చేయ‌గా కోహ్లీ 290 వ‌న్డేల్లో 279 ఇన్నింగ్స్‌ల్లో 13777 ప‌రుగుల‌తో పాంటింగ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. స‌చిన్ 463 వ‌న్డేల్లో 452 ఇన్నింగ్స్‌ల ద్వారా 18,426 ప‌రుగులు చేశాడు.

World Cup 2023 Prize Money : మీకు ఇది తెలుసా..? ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు, గ్రూప్ స్టేజీలో నిష్ర్క‌మించిన జ‌ట్ల‌కు ప్రైజ్‌మ‌నీ ఎంత ఇస్తారో..?

వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితా..

సచిన్ టెండూల్కర్ – 18426 ప‌రుగులు
కుమార సంగక్కర – 14234 ప‌రుగులు
విరాట్ కోహ్లీ – 13777* ప‌రుగులు
రికీ పాంటింగ్ -13704 ప‌రుగులు
సనత్ జయసూర్య – 13430 ప‌రుగులు