IND vs AUS World Cup final : భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డులు.. తుది జ‌ట్ల అంచ‌నా..

IND vs AUS World Cup final 2023 : ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు రంగం సిద్ధ‌మైంది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

IND vs AUS World Cup final

IND vs AUS World Cup final 2023 : ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు రంగం సిద్ధ‌మైంది. ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆస్ట్రేలియా ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సార్లు ( 1987, 1999, 2003, 2007, 2015) విజ‌యం సాధించ‌గా భార‌త్ రెండు సార్లు (1983, 2011) క‌ప్‌ను ముద్దాడింది. ఈ క్ర‌మంలో ఫైన‌ల్ మ్యాచ్‌లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారు అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు ఎన్ని సార్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఎవ‌రు ఎక్కువ మ్యాచుల్లో గెలిచారో అన్న వివ‌రాలు ఇప్ప‌డు చూద్దాం..

43 ఏళ్ల వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ ఫార్మాట్‌లో భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు 150 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 87 మ్యాచుల్లో విజ‌యం సాధించ‌గా, భార‌త్ 57 మ్యాచుల్లో గెలుపొందింది. మ‌రో 10 మ్యాచుల్లో ఫ‌లితం తేల‌లేదు. కాగా.. ఈ ప్ర‌పంచ‌క‌ప్ కు 10 రోజుల ముందు భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు 3 వ‌న్డేల సిరీస్‌ను ఆడ‌గా అన్ని మ్యాచుల్లోనూ భార‌త జ‌ట్టే విజేత‌గా నిలిచింది.

World Cup Final : ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించ‌నున్న ప్ర‌ముఖులు వీరే..! టాలీవుడ్ నుంచి రామ్‌చ‌ర‌ణ్‌..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎన్నిసార్లు త‌ల‌ప‌డ్డారంటే..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు 13 సార్లు సార్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 8 మ్యాచుల్లో ఆసీస్ గెల‌వగా, 5 మ్యాచుల్లో భార‌త్ విజ‌యం సాధించింది.

ఏ మ్యాచులో ఎవ‌రు ఎలా గెలిచారంటే..?

– 1983 జూన్ 13న ఆస్ట్రేలియా 162 ప‌రుగుల‌తో తేడాతో విజ‌యం
– 1983 జూన్ 20న భార‌త్ 118 ప‌రుగుల తేడాతో గెలుపు
– 1987 అక్టోబర్ 9న‌ ఆస్ట్రేలియా 1 పరుగు తేడాతో విజ‌యం
– 1987 అక్టోబర్ 22న భార‌త్ 56 పరుగుల తేడాతో గెలుపు
– 1992 మార్చి 1 ఆస్ట్రేలియా 1 పరుగు తేడాతో విజ‌యం
– 1996 ఫిబ్రవరి 27 ఆస్ట్రేలియా 16 పరుగుల తేడాతో గెలుపు
– 1999 జూన్ 4 ఆస్ట్రేలియా 77 పరుగుల తేడాతో విజ‌యం
– 2003 ఫిబ్రవరి 15 ఆస్ట్రేలియా 9 వికెట్లు తేడాతో గెలుపు
– 2003 మార్చి 23 ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో విజ‌యం
– 2011 మార్చి 24 భార‌త్ 5 వికెట్ల తేడాతో గెలుపు
– 2015 మార్చి 26 ఆస్ట్రేలియా 95 పరుగుల తేడాతో విజ‌యం
– 2019 జూన్ 9 భార‌త్ 36 పరుగుల తేడాతో గెలుపు
– 2023 అక్టోబర్ 8 భార‌త్ 6 వికెట్ల తేడాతో విజ‌యం

తుది జ‌ట్ల అంచ‌నా :

భార‌త జ‌ట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

IND vs AUS : మీరు వీటిని గ‌మ‌నించారా..? 2003, 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌కు మ‌ధ్య‌ అసాధార‌ణ‌మైన సారూప్య‌త‌లు!

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీప‌ర్‌), పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్