Tokyo Olympics 2020 : పతకం లేకుండానే వెనుదిరిగిన వరల్డ్ నెం.1

20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్.. ఒలింపిక్స్ నుంచి ఖాళీ చేతులతో వెనుదిరిగారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో పాల్గొన్న నోవాక్‌ జోకోవిచ్‌ సెమీ ఫైనల్స్‌ కారెన్నో బూస్టచేతిలో ఓటమి చవిచూశారు.

Tokyo Olympics 2020 : ప్రపంచ నెంబర్.1 టెన్నిస్ ఆటగాడు నోవాక్‌ జోకోవిచ్‌ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. వింబుల్డన్ 2021 టైటిల్ నెగ్గి మంచి జోరుమీదున్న జోకోవిచ్ టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్ లో ఓటమి చెందటంతో ఒలింపిక్స్ నుంచి వెనుదిరిగారు. సెమీ ఫైనల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతుల్లో ఓడిన నోవాక్ జొకోవిచ్, కారెన్నో బూస్టతో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లోనూ పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్ రెండు గంటల 47 నిమిషాలు పాటు సాగింది.

ఈ సుదీర్ఘ పోరాటంలో 4-6, 8-6, 3-6 తేడాతో జోకోవిచ్ ఇంటిముఖం పట్టారు. తొలిసెట్ కోల్పోయిన జోకోవిచ్.. రెండవ సెట్ లో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి సెట్ ని 8-6తో కైవసం చేసుకున్నాడు. ఇక చివరి సెట్ హోరాహోరీగా సాగింది. ఈ సెట్ లో కారెన్నో బూస్ట ఆధిపత్యం కనబరిచాడు. దీంతో 3-6 తో సెట్ చేజారింది. ఈ ఓటమితో పతకం లేకుండానే నోవాక్‌ జోకోవిచ్‌ వెనుదిరిగారు.

కాగా జకోవిచ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన నోవాక్‌ జోకోవిచ్‌ ఒలింపిక్స్ బంగారు పతకం మాత్రం సాధించలేకపోయారు.

ట్రెండింగ్ వార్తలు