World Record : క్రికెట్‌లో ఏ జట్టు ఎప్పుడు ఎలా రాణిస్తుందో చెప్పడం కాస్త కష్టమే. గెలుస్తాయనుకున్న జట్టు ఓడిపోవడం, తప్పక ఓడిపోతుంది అన్న జట్టు గెలవడం చూస్తూనే ఉంటాం. ఇక రికార్డుల గురించి చెప్పేది ఏముంది. ఎన్నో రికార్డులు నమోదు అవుతుండగా.. ఆ రికార్డుల్లో కొన్ని బ్రేక్ కూడా అవుతుంటాయి.
ఇక ఇప్పుడు చెప్పబోయే ఓ రికార్డు (World Record) దాదాపు 100 సంవత్సరాలుగా పదిలంగా ఉంది. మరో 100 సంవత్సరాలైన ఈ రికార్డు బద్దలు కావడం కాస్త కష్టమనే చెప్పవచ్చు.
99 ఏళ్లుగా చెక్కుచెదరలేదు..
ఈ రికార్డు అంతర్జాతీయ క్రికెట్‌లో నమోదైంది కాదు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నమోదైంది. 1926 డిసెంబర్ 24 నుంచి 29 వరకు విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులు చేసింది.
DPL 2025 : ఆపకుంటే కొట్టుకునే వాళ్లే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఘటన..
అనంతరం విక్టోరియా తమ తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లో విక్టోరియా బ్యాటర్లు పట్టపగలే న్యూ సౌత్ వేల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. ఓ ట్రిపుల్ సెంచరీ, ఓ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు నమోదు అయ్యాయంటే బౌలర్లపై వారు ఎంతలా ఆధిపత్యం చెలాయించారో అర్థం చేసుకోవచ్చు.
బిల్ పోన్స్‌ఫోర్డ్ (352) ట్రిపుల్ సెంచరీ బాదగా, జాక్ రైడర్ (295) తృటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యాడు. బిల్ వుడ్‌ఫుల్ (133), స్టార్క్ హెండ్రీ (100) సెంచరీలతో చెలరేగడంతో విక్టోరియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 1107 పరుగులు చేసింది.
ఫస్ట్ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో న్యూ సౌత్ వేల్స్ 230 పరుగులకే ఆలౌట్ కావడంతో విక్టోరియా జట్టు 656 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే..
ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఓ జట్టు 1000 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాలు కేవలం రెండు మాత్రమే. కాగా.. ఈ రెండు సార్లు ఈ ఘనత సాధించింది విక్టోరియానే కావడం గమనార్హం. న్యూ సౌత్ వేల్స్‌పై 1107 పరుగులు చేయడాని కన్నా ముందు 1923లో టాస్మానియాపై 1059 పరుగులు చేసింది.
Rohit Sharma : రోహిత్ శర్మకు ఎవరి బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం అంటే ఇష్టమో తెలుసా?
ఇప్పటి వరకు మరే జట్టు కూడా 1000 పరుగుల మైలురాయిని చేరుకోలేదు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు (ఒక ఇన్నింగ్స్‌లో)..
* విక్టోరియా – 1926లో న్యూ సౌత్ వేల్స్ పై 1107 పరుగులు
* విక్టోరియా – 1059 పరుగులు టాస్మానియాపై, 1923లో
* శ్రీలంక – 952/6 ఇన్నింగ్స్ డిక్లేర్డ్ వర్సెస్ ఇండియా 1997లో
* సింధ్ – 951/7 ఇన్నింగ్స్ డిక్లేర్డ్ వర్సెస్ బలూచిస్తాన్ 1974లో
* హైదరాబాద్ – 944/6 ఇన్నింగ్స్ డిక్లేర్డ్ వర్సెస్ ఆంధ్ర 1994లో